20 ఏళ్ల తర్వాత ఆసీస్‌పై వన్డే సిరీస్‌ సొంతం

3 Apr, 2022 05:47 IST|Sakshi

కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (105 నాటౌట్‌; 12 ఫోర్లు), ఇమామ్‌ (89 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించడంతో... ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో పాకిస్తాన్‌ 9 వికెట్ల తేడాతో నెగ్గింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను పాక్‌ 2–1తో సొంతం చేసుకుంది. 2002 తర్వాత ఆస్ట్రేలియాపై పాక్‌ తొలిసారి వన్డే సిరీస్‌ దక్కించుకుంది. ముందుగా ఆసీస్‌ 41.5 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌట్‌కాగా... పాక్‌ 37.5 ఓవర్లలో వికెట్‌ నష్టపోయి లక్ష్యాన్ని అందుకుంది.

మరిన్ని వార్తలు