ఆఖరి ఓవర్‌లో అర్షదీప్‌ మ్యాజిక్‌.. ఐదో టీ20లోనూ టీమిండియాదే గెలుపు 

3 Dec, 2023 22:28 IST|Sakshi

ఆఖరి ఓవర్‌లో అర్షదీప్‌ మ్యాజిక్‌.. ఐదో టీ20లోనూ టీమిండియాదే గెలుపు 
ఆఖరి ఓవర్‌లో ఆసీస్‌ గెలుపుకు 10 పరుగుల చేయాల్సిన తరుణంలో బంతిని అందుకున్న అర్షదీప్‌ మ్యాజిక్‌ చేశాడు. 6 బంతుల్లో వికెట్‌ తీసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి టీమిండియాను గెలిపించాడు. ఈ గెలుపుతో భారత్‌ 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగుల మాత్రమే చేసి 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

వరుస బంతుల్లో వికెట్లు తీసిన ముకేశ్‌ కుమార్‌
129 పరుగుల వద్ద ఆసీస్‌ వరుస బంతుల్లో వికెట్లు కోల్పోయింది. 17.3, 4 బంతుల్లో ముకేశ్‌ కుమార్‌.. షార్ట్‌(16), డ్వార్షుయిస్‌ (0)ను ఔట్‌ చేశాడు. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
102 పరుగుల వద్ద ఆసీస్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో ఆవేశ్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇ​చ్చి టిమ్‌ డేవిడ్‌ (17) ఔటయ్యారు. 

మూడో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
55 పరుగుల వద్ద ఆసీస్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. రవి బిష్ణోయ్‌ బౌలింగ్‌లో ఆరోన్‌ హార్డీ (6) ఔటయ్యాడు. 

రెండో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
47 పరుగుల వద్ద ఆస్ట్రేలియా రెండో వికెట్‌ కోల్పోయింది. రవి భిష్ణోయ్‌ బౌలింగ్‌లో ట్రవిస్‌ హెడ్‌ (28) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 5 ఓవర్ల తర్వాత ఆసీస్‌ స్కోర్‌ 48/2గా ఉంది.

టార్గెట్‌ 161.. తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
161 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌.. 22 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ముకేశ్‌ కుమార్‌ బౌలింగ్‌లో జోష్‌ ఫిలిప్‌ (4) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

రాణించిన ఆసీస్‌ బౌలర్లు.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన టీమిండియా
టాస్‌ ఓడి ఆసీస్‌ ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. ఆసీస్‌ బౌలర్లు రాణించడంతో భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ (53) ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించాడు. యశస్వి (21), జితేశ్‌ శర్మ (24), అక్షర్‌ పటేల్‌ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో బెహ్రెన్‌డార్ఫ్‌, డ్వాషుయిస్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. ఆరోన్‌ హార్డీ, నాథన్‌ ఇల్లిస్‌, తన్వీర్‌ సంగా తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

ఆరో వికెట్‌ కోల్పోయిన భారత్‌
143 పరుగుల వద్ద టీమిండియా ఆరో వికెట్‌ కోల్పోయింది. బెహ్రెన్‌డార్ఫ్‌ బౌలింగ్‌లో హార్డీకు క్యాచ్‌ ఇచ్చి అక్షర్‌ పటేల్‌ (31) ఔటయ్యాడు. 

97 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన టీమిండియా
97 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్‌ కోల్పోయింది. ఆరోన్‌ హార్డీ బౌలింగ్‌లో మాథ్యూ షార్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి జితేశ్‌ శర్మ (24) ఔటయ్యాడు. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్‌
55 పరుగుల వద్ద టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. రింకూ సింగ్‌ తన టీ20 కెరీర్‌లో తొలిసారి సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కు (6) ఔటయ్యాడు. 

నిప్పులు చెరుగుతున్న ఆసీస్‌ బౌలర్లు
46 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్‌ కోల్పోయింది. డార్షుయిస్‌ బౌలింగ్‌లో మెక్‌డెర్మాట్‌ క్యాచ్‌ పట్టడంతో సూర్యకుమార్‌ యాదవ్‌ (5) పెవిలియన్‌కు చేరాడు. 7 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 46/3. రింకూ సింగ్‌, శ్రేయస్‌ అయ్యర్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

రెండో వికెట్‌ డౌన్‌
నాలుగు బంతుల వ్వవధిలో టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. డ్వార్షుయిస్‌ బౌలింగ్‌లో బెహ్రెన్‌డార్‌ప్‌కు క్యాచ్‌ ఇచ్చి రుతురాజ్‌ (10) ఔటయ్యాడు. 

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌.. యశస్వి ఔట్‌
33 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. బెహ్రెన్‌డార్ఫ్‌ బౌలింగ్‌లో నాథన్‌ ఇల్లిస్‌కు క్యాచ్‌ ఇచ్చి యశిస్వి జైస్వాల్‌ (21) ఔటయ్యాడు. 4 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్‌ 33/1గా ఉంది. రుతురాజ్‌ (10), శ్రేయస్‌ క్రీజ్‌లో ఉన్నారు. 

బెంగళూరు వేదికగా టీమిండియాతో ఇవాళ (డిసెంబర్‌ 3) జరుగుతున్న నామమాత్రపు ఐదో టీ20లో ఆస్ట్రేలియా టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌, ఆస్ట్రేలియాలు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. భారత్‌ తరఫున దీపక్‌ చాహర్‌ స్థానంలో అర్షదీప్‌ సింగ్‌.. ఆసీస్‌ తరఫున క్రిస్‌ గ్రీన్‌ స్థానంలో నాథన్‌ ఇల్లిస్‌ బరిలో నిలిచారు. 

టీమిండియా: యశస్వి జైస్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), రింకూ సింగ్‌, జితేశ్‌ శర్మ, శివమ్‌ దూబే, అక్షర్‌ పటేల్‌, అర్షదీప్‌ సింగ్‌, రవి బిష్ణోయ్‌, ఆవేశ్‌ ఖాన్‌

ఆస్ట్రేలియా: ట్రవిస్‌ హెడ్‌, జోష్‌ ఫిలిప్‌, బెన్‌ మెక్‌డెర్మాట్‌, ఆరోన్‌ హార్డీ, టిమ్‌ డేవిడ్‌, మాథ్యూ షార్ట్‌, మాథ్యూ వేడ్‌ (కెప్టెన్‌), బెన్‌ డ్వారిషుయిస్‌, జేసన్‌ బెహ్రెన్‌డార్ఫ్‌, నాథన్‌ ఇల్లిస్‌, తన్వీర్‌ సంఘా

మరిన్ని వార్తలు