ఫిక్సింగ్‌ బారిన క్రికెటర్‌.. రెండేళ్ల నిషేధం

7 Feb, 2023 21:20 IST|Sakshi

పాకిస్తాన్‌ క్రికెట్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కొత్తేం కాదు. ఫిక్సింగ్‌ కలంకం ఏదో ఒక రూపంలో ఆ జట్టును చుట్టుముడుతునే వచ్చింది.గతంలో మహ్మద్‌ ఆసిఫ్‌, మహ్మద్‌ ఆమిర్‌, సల్మాన్‌ భట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధానికి గురయ్యారు. తాజాగా మరోసారి ఫిక్సింగ్‌ కలకలం రేపింది. లెప్టార్మ్‌ స్పిన్నర్‌, ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌ ఆసిఫ్‌ అఫ్రిది మ్యాచ్‌ ఫిక్సింగ్‌ పాల్పడినట్లు రుజువు కావడంతో పీసీఈబీ రెండేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. నిషేధం వెంటనే అమల్లోకి వస్తుందని పీసీబీ పేర్కొంది.

2022 ఏడాది సెప్టెంబర్‌లో ఆసిఫ్ అఫ్రిది కాశ్మీర్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొన్నాడు.అక్కడ రావల్‌కోట్ హాక్స్ జట్టు తరపున ఆడుతున్నప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. తమ విచారణలో ఫిక్సింగ్‌ ఆరోపణలు నిజమని తేలడంతో అతనిపై నిషేధం విధించింది.'' ఆర్టికల్ 2.4.10ని ఉల్లంఘించిన కారణంగా ఆసిఫ్‌ ఆఫ్రిదిపై రెండేళ్ల అనర్హత, దీంతో పాటు ఆర్టికల్ 2.4.4ను ఉల్లంఘించినందుకు ఆరు నెలల నిషేధం విధించాం. ఈ రెండు ఏకకాలంలో అమలు చేయబడుతాయి. 2024 సెప్టెంబర్‌ 12 వరకు ఈ నిషేధం అమల్లో ఉండనుంది.'' అని పీబీసీ పేర్కొంది.

లెఫ్ట్ ఆర్మ్ బౌలర్‌గా పేరు పొందిన ఆసిఫ్‌ అఫ్రిది 35 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 118 వికెట్లు తీశాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో 59 వికెట్లు తీశాడు. ఇక ఫస్ట్‌క్లాస్‌ టి20ల్లో 63 వికెట్లు తీశాడు. పీఎస్‌ఎల్‌లో ముల్తాన్ సుల్తాన్స్ తరపున ఆడిన ఆసిఫ్‌ అఫ్రిది దేశవాళీ క్రికెట్‌లో ఖైబర్ పఖ్తున్ఖ్వా తరపున ప్రాతినిధ్యం వహించాడు.

చదవండి: ఆసీస్‌తో సవాల్‌కు సిద్దం; బ్యాటింగ్‌లో ఏ స్థానమైనా ఓకే

మరిన్ని వార్తలు