పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం.. చీఫ్ సెలక్టర్‌గా దిగ్గజ బౌలర్‌

17 Nov, 2023 21:12 IST|Sakshi

పాకిస్తాన్‌ క్రికెట్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్‌ పురుషల క్రికెట్‌ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా మాజీ ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్‌ను ఆ దేశ క్రికెట్‌ బోర్డు నియమించింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు తెలియజేసింది.

ఇంజమామ్-ఉల్-హక్ స్ధానాన్ని రియాజ్‌ భర్తీ చేయనున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023కు ముందు పాకిస్తాన్‌ చీఫ్‌ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఇంజమామ్.. వ్యక్తిగత కారణాలతో టోర్నీ మధ్యలోనే తన పదవి నుంచి తప్పుకున్నాడు. ఈ క్రమంలోనే రియాజ్‌కు పీసీబీ సెలక్షన్‌ కమిటీ చైర్మెన్‌ బాధ్యతలు అప్పగించింది.

వచ్చె నెలలో ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్‌తో పాకిస్తాన్‌ చీఫ్ సెలెక్టర్‌గా రియాజ్‌ ప్రయాణం ప్రారంభం కానుంది. అతడి నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ ఆసీస్‌, న్యూజిలాండ్‌ సిరీస్‌లకు జట్టును ఎంపిక చేయనుంది.

కాగా వన్డే ప్రపంచకప్‌-2023లో ఘోర వైఫల్యం తర్వాత విదేశీ కోచ్‌లను పీసీబీ తొలిగించింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌ క్రికెట్‌ డైరక్టర్‌గా పనిచేసిన మిక్కీ అర్ధర్‌, బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కిల్‌పై వేటు వేసింది. దీంతో తమ జట్టు క్రికెట్‌ డైరక్టర్‌ బాధ్యతలు మాజీ కెప్టెన్‌ మహ్మద్ హఫీజ్‌కు పీసీబీ అప్పగించింది. బౌలింగ్‌ కోచ్‌గా ఉమర్‌ గుల్‌ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
చదవండి: World cup 2023: ఆస్ట్రేలియాతో ఫైనల్‌.. వక్ర బుద్ధి చూపించిన పాక్‌ క్రికెటర్‌

మరిన్ని వార్తలు