-

T20 WC 2023: సెమీస్‌కు ముందు టీమిండియాకు బిగ్‌ షాక్‌.. స్టార్‌ ఆల్‌రౌండర్‌ దూరం

23 Feb, 2023 16:51 IST|Sakshi

ఐసీసీ మహిళా టీ20 ప్రపంచకప్‌-2023 సెమీస్‌ మ్యాచ్‌కు ముందు భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ పూజా వస్త్రాకర్ అనారోగ్య కారణంతో టీ20 ప్రపంచకప్‌ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. ఆమె ప్రస్తుతం శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతుంది.

ఇప్పటివరకు ఈ టోర్నీలో నాలగు మ్యాచ్‌లు ఆడిన ఆమె రెండు వికెట్లు పడగొట్టింది. ఇక పూజా స్థానాన్ని మరో ఆల్ రౌండర్ స్నేహ్ రానాతో సెలక్షన్ కమిటీ భర్తీ చేసింది. పూజా స్థానాన్ని స్నేహ్ రానాతో భర్తీ చేయడాన్ని ఐసీసీ ఈవెంట్ టెక్నికల్ కమిటీ కూడా ఆమోదించింది. అయితే తుది జట్టులో మాత్రం స్నేహ్ రానా చోటు దక్కే అవకాశం కన్పించడం లేదు.

ప్లేయింగ్‌ ఎల్‌వెన్‌లో పూజా స్థానంలో దేవికా వైద్య వైపు జట్టు మెనెజ్‌మెంట్‌ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. మరోవైపు ఆస్ట్రేలియాతో సెమీఫైనల్‌కు భారత కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌కౌర్‌ అందుబాటుపై కూడా సంధిగ్ధం నెలకొంది. కీలక మ్యాచ్‌కు ముందు హర్మన్‌ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఇక ఆస్ట్రేలియా-భారత్‌ మధ్య తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌ గురువారం(ఫిబ్రవరి 23) సాయంత్రం 6:30 గంటల నుంచి ప్రారంభం కానుంది.

టీ20 వరల్డ్‌కప్‌-2023 తొలి సెమీ ఫైనల్‌- తుది జట్లు (అంచనా) 
భారత్‌: స్మృతి మంధాన, షఫాలీ, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, శిఖా పాండే, రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్‌, రేణుక, యస్తికా భాటియా, దేవికా వైద్య. 

ఆస్ట్రేలియా: మెగ్‌ లానింగ్‌ (కెప్టెన్‌), బెత్‌ మూనీ, అలీసా హీలీ, ఎలీస్‌ పెర్రీ, ఆష్లే గార్డ్‌నర్, తాలియా మెక్‌గ్రాత్, గ్రేస్‌ హారిస్, జార్జియా, అలానా కింగ్, మేగన్‌ షుట్, డార్సీ బ్రౌన్‌. 
చదవండి: T20 WC 2023: సెమీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్‌.. కెప్టెన్‌కు అస్వస్థత?!

మరిన్ని వార్తలు