పేట్రేగిపోయిన పృథ్వీ షా.. వన్డే ఫార్మాట్‌లో భారీ ద్విశతకం, 28 ఫోర్లు, 11 సిక్సర్లతో విధ్వంసం

9 Aug, 2023 20:14 IST|Sakshi

టీమిండియా యంగ్‌ ఓపెనర్‌, ముంబై ఆటగాడు పృథ్వీ షా ఇంగ్లండ్‌ దేశవాలీ వన్డే టోర్నీ (లిస్ట్‌-ఏ క్రికెట్‌), మెట్రో బ్యాంక్‌ వన్డే కప్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సోమర్‌సెట్‌తో ఇవాళ (ఆగస్ట్‌ 9) జరిగిన మ్యాచ్‌లో భారీ ద్విశతం (153 బంతుల్లో 244; 28 ఫోర్లు, 11 సిక్సర్లు) బాది ఆల్‌టైమ్‌ రికార్డులు బద్దలుకొట్టాడు. ఫలితంగా అతను ప్రాతినిథ్యం వహిస్తున్న నార్తంప్టన్‌షైర్‌ తొలుత బ్యాటింగ్‌ చేస్తూ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 415 పరుగుల రికార్డు స్కోర్‌ చేసింది.

ఓపెనర్‌గా బరిలోకి దిగిన షా డబుల్‌ సెంచరీతో విధ్వంసం సృష్టించగా.. సామ్‌ వైట్‌మ్యాన్‌ (54), రికార్డో వాస్కో (47), ఎమిలియో గే (30) రాణించారు. సోమర్‌ సెట్‌ బౌలర్లలో జాక్‌ బ్రూక్స్‌ 3 వికెట్లు పడగొట్టగా.. డానీ లాంబ్‌ 2, షోయబ్‌ బషీర్‌, జార్జ్‌  థామస్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. షా విధ్వంసం ధాటికి సోమర్‌సెట్‌ బౌలర్లంతా ఊచకోతకు గురయ్యారు. ప్రతి బౌలర్‌ దాదాపు 9 రన్‌రేట్‌తో పరుగులు సమర్పించుకున్నాడు.


పృథ్వీ షా డబుల్‌ సెంచరీ విశేషాలు..

  • ఈ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో కలిపి 60 పరుగులు చేసిన పృథ్వీ షా.. ఇంగ్లండ్‌ డొమెస్టిక్‌ క్రికెట్‌లో తన మూడో అప్పియరెన్స్‌లోనే డబుల్‌ సెంచరీ బాదాడు. ఇదే టోర్నీతో షా ఇంగ్లండ్‌ డొమెస్టిక్‌ సర్క్యూట్‌లోకి అరంగేట్రం చేశాడు. 
  • ఈ మ్యాచ్‌లో 153 బంతులను ఎదుర్కొన్న షా 28 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో  244 పరుగులు చేసి, ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అలాగే ఈ టోర్నీ డబుల్‌ సెంచరీ చేసిన మూడో ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు. 
  • ఈ టోర్నీ చరిత్రలో డబుల్‌ సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.
  • 129 బంతుల్లో డబుల్‌ సెంచరీ పూర్తి చేసిన షా.. ఇంగ్లండ్‌ లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ డబుల్‌ సెంచరీ రికార్డు నమోదు చేశాడు. 
  • ఈ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీతో చెలరేగిన షా.. ఇంగ్లండ్‌ లిస్ట్‌-ఏ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ నమోదు చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు చతేశ్వర్‌ పుజారా (174) పేరిట ఉంది.
  • లిస్ట్‌-ఏ చరిత్రలో ఆరో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌
  • ఇంగ్లండ్‌ లిస్ట్‌-ఏ క్రికెట్‌లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌
  • నార్తంప్టన్‌షైర్‌ తరఫున హైయెస్ట్‌ లిస్ట్‌-ఏ స్కోర్‌
  • ఇంగ్లండ్‌ లిస్ట్‌-ఏ క్రికెట్‌లో డబుల్‌ సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడు
  • లిస్ట్‌-ఏ క్రికెట్‌లో రెండు వేర్వేరు దేశాల్లో డబుల్‌ సెంచరీలు చేసిన తొలి ఆటగాడు. భారత దేశవాలీ వన్డే టోర్నీలోనూ షా ఓ డబుల్‌ సెంచరీ చేశాడు.
  • లిస్ట్‌-ఏ క్రికెట్‌లో రోహిత్‌ శర్మ (3) తర్వాత అత్యధిక డబుల్‌ సెంచరీలు (2)

మరిన్ని వార్తలు