బిర్యానీ కంటే ఎక్కువ ఇష్టపడతా.. సూర్యను ట్రోల్‌ చేసిన రషీద్‌

1 Jun, 2021 20:34 IST|Sakshi

ముంబై: టీమిండియా ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఆట ఆరంభం నుంచి దూకుడు స్వభావం కనబరిచే సూర్య..  ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20 ద్వారా అరంగేట్రం చేశాడు. అయితే, ఆ మ్యాచ్‌లో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, మరో అరంగేట్ర ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో సూర్యకుమార్‌కు బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. ఈ క్రమంలో నాలుగో టీ20 ద్వారా టీమిండియాకు ఆడాలన్న తన కల నెరవేర్చుకున్న సూర్య.. సిక్సర్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల ఖాతా తెరిచాడు. అంతేగాక, తొలి మ్యాచ్‌లోనే హాఫ్‌ సెంచరీ(51) కొట్టిన ఐదో భారత క్రికెటర్‌గా ఘనత సాధించాడు. కాగా జూలైలో శ్రీలంక పర్యటనలో భాగంగా టీమిండియా రెండో జట్టుకు సూర్యకుమార్‌ ఎంపిక అయ్యే అవకాశం ఉంది.

ఈ విషయం కాసేపు పక్కనపెడితే.. సూర్య ట్రోల్‌ చేయడంలోనూ ముందుంటాడు. ఇటీవలే శ్రేయాస్‌ అయ్యర్‌ ఫిట్‌నెస్‌పై ట్రోల్‌ చేసిన సూర్య.. చహల్‌ను కూడా ఆటపట్టించాడు. తాజాగా తన భార్యకు పెళ్లిరోజు విషెస్‌ చెబుతూ ఒక పోస్టును షేర్‌ చేశాడు. ''దేవిశా శెట్టితో నీతో పెళ్లి జరిగి ఐదు సంవత్సరాలు. ఈ ఐదేళ్లలో బిర్యానీ కంటే నా భార్యనే ఎక్కువగా ఇష్టపడ్డా.. ఇకపై ఇష్టపడుతా.. హ్యాపీ వెడ్డింగ్‌ యానివర్సరీ టు మీ అండ్‌ మై వైఫ్‌'' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. అయితే సూర్య పెట్టిన కామెంట్‌పై అప్ఘన్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ అతన్ని ట్రోల్‌ చేశాడు. ''భాయ్‌.. పెళ్లిరోజు శుభాకాంక్షలు.. నీ బ్యాటింగ్‌ కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నావా'' అంటూ ఫన్నీ కామెంట్‌ చేశాడు.

కాగా ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సూర్యకుమార్‌ ముంబై ఇండియన్స్‌ తరపున ప్రాతినిధ్యం వహించగా.. రషీద్‌ ఖాన్‌ ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆడాడు. కాగా కరోనా మహ‍మ్మారితో బీసీసీఐ సీజన్‌ మధ్యలోనే రద్దు చేసింది. రద్దయ్యే సమయానికి లీగ్‌లో 29 మ్యాచ్‌లు జరగ్గా.. మరో 31 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఇక సెప్టెంబర్‌ 15 నుంచి అక్టోబర్‌ 15 మధ్య యూఏఈ వేదికగా మిగిలిన సీజన్‌ను పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తోంది.
చదవండి: మాట తప్పావంటూ ట్రోలింగ్‌.. కోహ్లి కౌంటర్‌

Suryakumar Yadav: కోహ్లి నన్ను స్లెడ్జ్‌ చేశాడు.. సంతోషం!

A post shared by Surya Kumar Yadav (SKY) (@surya_14kumar)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు