-

IND vs AUS: రింకూ సింగ్‌ అరుదైన రికార్డు.. యువరాజ్‌ సింగ్‌, హార్దిక్‌ సరసన

27 Nov, 2023 19:12 IST|Sakshi

రింకూ సింగ్‌.. ఈ పేరు ప్రస్తుతం ఇండియన్‌ క్రికెట్‌లో మారుమ్రోగిపోతుంది. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగుతున్న టీ20 సిరీస్‌లో రింకూ సింగ్‌ తన ఆటతీరుతో అందరిని అకట్టుకున్నాడు. ఐపీఎల్‌లో కనబరిచిన దూకుడునే అంతర్జాతీయ క్రికెట్‌లోనూ కొనసాగిస్తున్నాడు.

తొలి మ్యాచ్‌లో 22 పరుగులతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన రింకూ.. రెండో టీ20లో కేవలం 9 బంతుల్లోనే 31 పరుగులు చేసి దుమ్మురేపాడు. అతడి ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. దీంతో అతడిని టీమిండియా నయా ఫినిషర్‌ అని, మరో ధోని దొరికాడని సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది.

రింకూ అరుదైన రికార్డు..
కాగా రెండో టీ20లో దుమ్మురేపిన రింకూ సింగ్‌ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.  అంతర్జాతీయ టీ20ల్లొ ఒకే మ్యాచ్‌లో అత్యధిక స్ట్రైక్-రేట్(25 కంటే ఎక్కువ పరుగులు)తో బ్యాటింగ్‌ చేసిన నాలుగో భారత ఆటగాడిగా రింకూ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో రింకూ 344.44 స్ట్రైక్-రేట్‌తో 31 పరుగులు చేశాడు. 

ఈ అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ఉన్నాడు. 2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై 362.50 స్ట్రైక్-రేట్‌తో కేవలం 16 బంతుల్లోనే 58 పరుగులు చేశాడు. యువీ తర్వాతి స్ధానాల్లో దినేష్‌ కార్తీక్‌(362.50) ఉన్నాడు. 2018 నిదాదాస్‌ ట్రోఫీలో బంగ్లాదేశ్‌పై ఫైనల్లో కార్తీక్‌ కేవలం 8 బంతుల్లోనే 29 పరుగులు చేశాడు. మూడో స్ధానంలో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా(355.55) ఉన్నాడు.
చదవండి: సచిన్‌కే అన్నేళ్లు పట్టింది.. టీ20 వరల్డ్‌కప్‌ టీమిండియాదే: రవిశాస్త్రి

మరిన్ని వార్తలు