-

Ind vs Aus: యశస్వి సరికొత్త చరిత్ర.. రోహిత్‌ రికార్డు బద్దలు! తొలి భారత బ్యాటర్‌గా..

27 Nov, 2023 12:51 IST|Sakshi
యశస్వి జైశ్వాల్‌ (PC: BCCI)

India vs Australia, 2nd T20I: టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వి జైశ్వాల్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20లలో అరుదైన ఘనత సాధించిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. కాగా ఆస్ట్రేలియాతో రెండో టీ20లో టాస్‌ ఓడిన సూర్య సేన తొలుత బ్యాటింగ్‌ చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఓపెనర్లు యశస్వి జైశ్వాల్‌, రుతురాజ​ గైక్వాడ్‌ అర్ధ శతకాలతో శుభారంభం అందించారు. ముఖ్యంగా యశస్వి ఆకాశమే హద్దుగా చెలరేగుతూ 25 బంతుల్లోనే 53 పరుగులు సాధించాడు. తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో యాభై పరుగుల మార్కు పూర్తి చేసుకున్నాడు.

పవర్‌ప్లే వీరుడిగా
ఈ నేపథ్యంలో యశస్వి జైశ్వాల్‌ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20లో పవర్‌ ప్లేలో అత్యధిక పరుగులు రాబట్టిన భారత బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. గతంలో ఈ రికార్డు కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ పేరిట ఉండేది.

ఇదిలా ఉంటే.. తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 44 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో నిలిచింది. యశస్వి, రుతురాజ్‌(58)తో పాటు ఇషాన్‌ కిషన్‌ హాఫ్‌ సెంచరీ(52) చేయగా.. రింకూ సింగ్‌ 9 బంతుల్లోనే 31 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఈ క్రమంలో 235 పరుగులు చేసిన టీమిండియా.. ఆస్ట్రేలియాను 191 పరుగులకే కట్టడి చేసి గెలుపొందింది. తదుపరి గువాహటి వేదికగా మంగళవారం ఇరు జట్ల మధ్య మూడో టీ20 జరుగనుంది.

అంతర్జాతీయ టీ20లలో పవర్‌ప్లేలో అత్యధిక పరుగులు రాబట్టిన భారత బ్యాటర్లు
►హోమిల్టన్‌లో 2020లో న్యూజిలాండ్‌ మీద రోహిత్‌ శర్మ- 50(23) నాటౌట్‌
►దుబాయ్‌లో 2021లో స్కాట్లాండ్‌ మీద కేఎల్‌ రాహుల్‌- 50(19)
►తిరువనంతపురంలో 2023లో ఆస్ట్రేలియా మీద యశస్వి జైశ్వాల్‌- 53(25).

చదవండి: IPL 2024: 13 కోట్ల ఆటగాడిని వదిలేసిన సన్‌రైజర్స్‌.. మరో బౌలర్‌కు ఝలక్‌

మరిన్ని వార్తలు