షాకింగ్‌: పార్కింగ్‌ టిక్కెట్లు విక్రయిస్తున్న యువ బాక్సర్‌

7 Aug, 2021 14:24 IST|Sakshi

టోక్యో ఒలింపిక్స్‌ లో భారత ఆటగాళ్ల వీర విహారం

ఇటు కుటుంబంకోసం పార్కింగ్‌ టికెట్లను విక్రయిస్తున్న యువ బాక్సర్‌ రీతూ

సాక్షి, న్యూఢిల్లీ: ఒకపక్క దేశంలో టోక్యో ఒలింపిక్స్‌ లో భారత ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో పతకాలను సాధించి దేశ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. విజేతలపై ప్రశంసలు, బహుమతుల వర్షం కురుస్తోంది. మరోవైపు పొట్ట కూటికోసం యువ బాక్సర్ రోడ్డున పడిన వైనం క్రీడాభిమానుల్లోనూ, క్రీడాకారుల్లోనూ కలకలం రేపింది.  (Mirabai Chanu: మరోసారి మనసు దోచుకున్న చాను, ప్రాక్టీస్‌ షురూ, ఫోటో వైరల్‌)

చండీగఢ్‌లో యువ బాక్సర్ రీతు పార్కింగ్ టిక్కెట్లను విక్రయిస్తోంది. తనకు ప్రోత్సాహం లేకపోవడంతో బాక్సింగ్‌ను వదిలి వేసింది. చివరకి గత్యంతరం లేక తన కుటుంబానికి అండగా ఉండేందుకు చండీగఢ్‌లో పార్కింగ్ టిక్కెట్లను విక్రయిస్తోంది. తాను జాతీయ స్థాయిలో చాలా మ్యాచ్‌లు ఆడి, పతకాలు సాధించానని రీతూ తెలిపింది. క్రీడాకారిణిగా తనకు తన కుటుంబం చాలా అండగా నిలిచిందని తెలిపింది. కానీ తనకు ఎలాంటి ప్రోత్సాహకాలు, స్కాలర్‌షిప్‌లు రాలేదని తెలిపింది. అనారోగ్యంతో ఉన్న తన తండ్రిని కాపాడుకునేందుకు, ఆర్థిక అవసరాలకోసం తనకెంతో ఇష్టమైన క్రీడలను విడిచిపెట్టాల్సి వచ్చిందని వాపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం సహాయం చేస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. (Vandana Katariya: ఉత్తరాఖండ్‌ డాటర్‌కు భారీ నజరానా)

మరిన్ని వార్తలు