నా కెప్టెన్సీ స్కిల్స్‌కు అతనే కారణం: రోహిత్‌

27 Sep, 2020 17:14 IST|Sakshi

దుబాయ్‌: రోహిత్‌ శర్మ,.. ఒక సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌. టీమిండియాకు సారథ్యం వహించిన కొన్ని సందర్భాలతో పాటు ఐపీఎల్‌లో కూడా రోహిత్‌ శర్మ తన మార్కు కెప్టెన్సీని చూపెట్టి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఐపీఎల్‌లో నాలుగు టైటిల్స్‌ సాధించిన ఏకైక కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. పాంటింగ్‌ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రోహిత్‌ శర్మ 2013లో తొలిసారి ముంబై ఇండియన్స్‌కు టైటిల్‌ సాధించిపెట్టాడు. ఆపై 2015, 2017, 2019ల్లో ముంబై ఇండియన్స్‌ టైటిల్స్‌ గెలిచింది. ఇది ఐపీఎల్‌ చరిత్రలో ఒక జట్టు సాధించిన అత్యధిక టైటిల్స్‌ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఈ నాలుగు సందర్భాల్లోనూ రోహిత్‌ శర్మ కెప్టెన్‌గానే ఉండటం ఇక్కడ విశేషం. (చదవండి: ఊరిస్తున్న సన్‌రైజర్స్‌ టైటిల్‌ సెంటిమెంట్‌!)

అయితే తాను కెప్టెన్సీలో రాటుదేలడానికి ఆసీస్‌ దిగ్జజ కెప్టెన్‌, ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగే కారణమని అంటున్నాడు రోహిత్‌. తన నాయకత్వ లక్షణాలు మెరుగుపడటానికి పాంటింగ్‌ ఎంతగానో దోహద పడ్డాడని అన్నాడు. ఇండియా టూడే నిర్వహించిన ఫస్ట్‌ ఎపిసోడ్‌ ఇన్సిపిరేషన్‌ సీజన్‌-2లో రోహిత్‌ మాట్లాడుతూ.. ‘ ప్రతీ ఒక్క ఆటగాడి నుంచి ఏ విధంగా ప్రదర్శన రాబట్టాలో అనే విషయం పాంటింగ్‌ వద్ద నుంచి నేర్చుకున్నా. ఇక్కడ నా ప్రదర్శన అనేది ముఖ్యమైనదే అయినా ఇక్కడ ప్రతీ ఒక్కరి సాయం తీసుకోవడానికి యత్నిస్తా. తుదిజట్టులోని మిగతా పదిమంది సభ్యులతో పాటు రిజర్వ్‌ బెంచ్‌లో ఉన్నవారి సలహాలు కూడా స్వీకరిస్తా.  ఇది చాలా ముఖ్యమైనది. 

ఈ విషయాన్ని ప్రత్యేకంగా రికీ పాంటింగ్‌ నుంచి బోధపడింది. నాకు పాంటింగ్‌ ఎప్పుడూ ఒకటే చెబుతూ ఉండేవాడు. కెప్టెన్సీ చేసేటప్పుడు వారి ఏమి చేస్తున్నారు అనే విషయం గురించి ఆలోచించకు. వారు చెప్పేది ముందు విను. దాన్ని మర్యాదగా స్వీకరించి దాన్ని ఫిల్టర్‌ చేసుకో అని పాంటింగ్‌ చెబుతూ ఉండేవాడు. ఇదొక గొప్ప పాంటింగ్‌ నుంచి నేర్చుకున్న గొప్ప పాఠం’ అని రోహిత్‌ శర్మ తెలిపాడు. గతంలో ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా చేసిన పాంటింగ్‌, ఆపై కోచ్‌గా కూడా పని చేశాడు. ఇక ఆసీస్‌కు రెండు వన్డే వరల్డ్‌కప్‌లు అందించిన ఘనత పాంటింగ్‌ది. మరొకవైపు ఆసీస్‌ను టెస్టుల్లోనూ, వన్డేల్లోనూ నంబర్‌ వన్‌ స్థానంలో నిలబెట్టాడు.

Poll
Loading...
Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు