AUS vs PAK: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌.. పాక్‌ జట్టు ప్రకటన! యువ సంచలనం ఎంట్రీ

20 Nov, 2023 19:07 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టిన పాకిస్తాన్‌.. ఆస్ట్రేలియా పర్యటనకు సిద్దమవుతోంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో​ పాకిస్తాన్‌ తలపడనుంది. ఈ క్రమంలో 18 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు సోమవారం ప్రకటించింది. ఈ జట్టుకు వెటరన్‌ బ్యాటర్‌ షాన్‌ మసూద్‌ సారథ్యం వహించనున్నాడు.

ఈ సిరీస్‌తో పాకిస్తాన్‌ టెస్టు కెప్టెన్‌గా మసూద్‌ ప్రయాణం ప్రారంభం కానుంది. బాబర్‌ ఆజం కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో పాక్‌ టెస్టు సారధిగా మసూద్‌ ఎంపికయ్యాడు. ఇక దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న యువ ఓపెనర్‌ సైమ్ అయూబ్‌కు తొలిసారి పాక్‌ టెస్టు జట్టులో చోటు దక్కింది. అయూబ్‌తో పాటు యువ బౌలర్‌ ఖుర్రం షాజాద్‌కు పాక్‌ సెలక్టర్లు పిలుపునిచ్చారు. కాగా డిసెంబర్‌ 14న పెర్త్‌ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.

ఆసీస్‌తో టెస్టులకు పాక్‌ జట్టు: షాన్ మసూద్ (కెప్టెన్‌), సయీమ్ అయూబ్, అమీర్ జమాల్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ (వికెట్‌ కీపర్‌), ఇమామ్-ఉల్-హక్, సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్‌ కీప), షాహీన్ షా ఆఫ్రిది, మహ్మద్ వసీం జూనియర్, మీర్ హమ్జా, ఖుర్రం షాజాద్ హసన్ అలీ, ఫహీమ్ అష్రఫ్, నోమన్ అలీ, అబ్రార్ అహ్మద్, సల్మాన్ అలీ అఘా, సౌద్ షకీల్
చదవండి: CWC 2023: నిన్నటి రోజు మనది కాకుండా పోయింది.. మోదీకి ధన్యవాదాలు: షమీ భావోద్వేగం

మరిన్ని వార్తలు