IPL 2023 Mini Auction-Sam Curran: సామ్‌ కరన్‌ కొత్త చరిత్ర.. వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా

23 Dec, 2022 15:45 IST|Sakshi

ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌కు కళ్లు చెదిరే మొత్తం లభించింది. ఈ ఆల్‌రౌండర్‌ను పంజాబ్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీ రూ. 18.50 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. తద్వారాఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాడిగా సామ్‌ కరన్‌ కొత్త చరిత్ర సృష్టించాడు. ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌లో సామ్‌ కరన్‌ సూపర్‌ ప్రదర్శన ఇచ్చాడు.

ఇంగ్లండ్‌ విజేతగా నిలవడంలో ఈ ఆల్‌రౌండర్‌ది కీలకపాత్ర. డెత్‌ ఓవర్లలో కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను చాలా మ్యాచ్‌ల్లో గెలిపించాడు. ఈ ప్రదర్శనే అతన్ని ఇవాళ ఐపీఎల్‌లో రికార్డు ధరకు అమ్ముడయ్యేలా చేసింది. అతని కోసం రాజస్తాన్‌ రాయల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ పోటీ పడినప్పటికి.. చివరకు పంజాబ్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది.

ఇప్పటివరకు దక్షిణాఫ్రికాకు చెందిన  ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ ఐపీఎల్‌ 2021 మినీ వేలంలో రాజస్తాన్‌ రాయల్స్‌ రూ. 16.25 కోట్లకు కొనుగోలు చేయడం రికార్డుగా ఉంది. తాజాగా  ఆ రికార్డును సామ్‌ కరన్‌ బద్దలుకొట్టాడు. 

ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడైన ఆటగాళ్లు..
సామ్‌ కరన్‌- రూ. 18.50 కోట్లు- పంజాబ్‌ కింగ్స్‌
కామెరున్‌ గ్రీన్‌- రూ. 17.5 కోట్లు- ముంబై ఇండియన్స్‌
బెన్‌ స్టోక్స్‌- రూ.16.25 కోట్లు-  సీఎస్‌కే
క్రిస్‌ మోరిస్‌- రూ. 16.25 కోట్లు- రాజస్తాన్‌ రాయల్స్‌
యువరాజ్‌ సింగ్‌- రూ. 16 కోట్లు- ఢిల్లీ డేర్‌డెవిల్స్‌
పాట్‌ కమిన్స్‌- రూ. 15.5 కోట్లు- కేకేఆర్‌
ఇషాన్‌ కిషన్‌- రూ. 15. 5 కోట్లు- ముంబై ఇండియన్స్‌

కైల్‌ జేమీసన్‌- రూ. 15 కోట్లు- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)
బెన్‌ స్టోక్స్‌- రూ.14.50 కోట్లు- రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్స్‌
దీపక్‌ చహర్‌- రూ. 14 కోట్లు- సీఎస్‌కే

మరిన్ని వార్తలు