Wimbledon 2022 Draw: 113వ ర్యాంకర్‌తో సెరెనా తొలిపోరు

25 Jun, 2022 07:29 IST|Sakshi

లండన్‌: గత ఏడాది వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీ సింగిల్స్‌ తొలి రౌండ్‌లోనే గాయంతో వైదొలిగిన సెరెనా విలియమ్స్‌... ఏడాది తర్వాత మళ్లీ అదే టోర్నీతో పునరాగమనం చేయనుంది. సోమవారం మొదలయ్యే ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి సంబంధించి శుక్ర వారం ‘డ్రా’ విడుదల చేశారు. తొలి రౌండ్‌లో ప్రపంచ 113వ ర్యాంకర్‌ హార్మనీ టాన్‌ (ఫ్రాన్స్‌)తో సెరెనా తలపడుతుంది.

కెరీర్‌లో మొత్తం 23 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టోర్నీలు నెగ్గిన 40 ఏళ్ల సెరెనా ఏడుసార్లు వింబుల్డన్‌ సింగిల్స్‌లో విజేతగా నిలిచింది. గాయం కారణంగా సెరెనా ఏడాదిపాటు ఆటకు దూరమైంది. దాంతో ఆమె ర్యాంక్‌ కూడా పడిపోయి ప్రస్తుతం 1,204 స్థానానికి చేరుకుంది. ర్యాంకింగ్‌ ప్రకారమైతే సెరెనా ఈ టోర్నీలో ఆడే అవకాశమే లేదు. అయితే ఆమె గత రికార్డులను దృష్టిలో పెట్టుకొని వింబుల్డన్‌ నిర్వాహకులు ‘వైల్డ్‌ కార్డు’ ఎంట్రీని కేటాయించారు.
చదవండిSkating: అన్న.. చెల్లి.. అదుర్స్‌ .. జాతీయ స్థాయిలో పతకాల పంట

మరిన్ని వార్తలు