వర్క్‌వుట్‌ వీడియోతో అయ్యర్‌.. సూర్యకుమార్‌ ట్రోల్‌

23 May, 2021 22:26 IST|Sakshi

ఢిల్లీ: టీమిండియా యువ ఆటగాడు శ్రేయాస్‌ అయ్యర్‌ భుజం గాయం నుంచి త్వరగానే కోలుకున్నట్లు తెలుస్తుంది. గత మార్చిలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా అయ్యర్‌ భుజం గాయం బారీన పడ్డాడు. వైద్యులు అతన్ని పరిశీలించి సర్జరీ అవసరమని తెలిపారు. దీంతో అయ్యర్‌ భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. భుజం గాయం నుంచి కోలుకోవడానికి ఐదు నెలల సమయం పట్టనుందని వైద్యులు తెలపడంతో అయ్యర్‌ ఐపీఎల్‌ 14వ సీజన్‌కు దూరమయ్యాడు. అతని స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ రిషబ్‌ పంత్‌ను కెప్టెన్‌గా నియమించింది. అయితే కరోనా సెగతో ఐపీఎల్‌ 14వ సీజన్‌ను రద్దు చేయడంతో అయ్యర్‌కు మళ్లీ లీగ్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. ఒకవేళ సెప్టెంబర్‌లో ఐపీఎల్‌ మిగిలిన మ్యాచ్‌లు నిర్వహించే అవకాశం ఉంటే అయ్యర్‌ అందులో ఆడేందుకు చాన్స్‌ ఉంది.

ఈ నేపథ్యంలో అతను తన ఫిట్‌నెస్‌ను మెరుగుపరుచుకునేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. ఔట్‌డోర్‌ రన్నింగ్‌లో భాగంగా గ్రావెల్‌ ట్రాక్‌పై రన్నింగ్‌ చేసిన వీడియోను అయ్యర్‌ తన ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు. దీనిపై ముంబై ఇండియన్స్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ కామెంట్‌ చేశాడు. అయ్యర్‌ నీ షెహన్‌ షా రన్నింగ్‌ టెక్నిక్‌ బాగుంది అంటూ ట్రోల్‌ చేశాడు. ఇక అయ్యర్‌ తన ఫిట్‌నెస్‌ టెస్టు నిరూపించుకుంటే జూలైలో శ్రీలంక పర్యటనకు ఎంపికయ్యే అవకాశాలు ఉ‍న్నాయి.
చదవండి: WTC Final: గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన క్రికెటర్‌

45 ఏళ్ల వయసులో ఇరగదీశాడు.. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు

A post shared by Shreyas Iyer (@shreyas41)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు