T20 World Cup 2022: దురదృష్టం అంటే దక్షిణాఫ్రికాదే.. గ్లౌవ్‌ను తాకినందుకు ఐదు పరుగులు

25 Oct, 2022 08:23 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌ 2022 సూపర్‌-12లో భాగంగా జరిగిన దక్షిణాఫ్రికా- జింబాబ్వే మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ లభించింది. అయితే పలు మార్లు వర్షం​ అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చేసుకుంది. ప్రోటీస్‌ వికెట్‌ కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ చేసిన చిన్న తప్పిదం వల్ల ప్రత్యర్ధి జట్టుకు 5 పెనాల్టీ పరుగులతో పాటు అదనంగా బంతి కూడా లభించింది. 

ఏం జరిగిందంటే..?
వర్షం కారణంగా మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వేతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. అయితే అఖరి నోకియా వేసిన అఖరి ఓవర్‌ రెండో బంతిని బ్యాటర్‌ మిల్టన్ శుంబా థర్డ్‌ మ్యాన్‌ దిశగా ఆడాడు. అయితే థర్డ్‌ మ్యాన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న లుంగీ ఎంగిడీ.. వికెట్‌ కీపర్‌ వైపు త్రో విసిరాడు.

ఈ క్రమంలో మైదానంలో ఉంచిన క్వింటన్ డి కాక్ గ్లోవ్‌లను బంతి తాకింది. దీంతో అంపైర్‌లు ఐదు పెనాల్టీ పరుగులతో పాటు బంతిని డెడ్‌బాల్‌గా ప్రకటించారు. కాగా త్వరగా బంతిని  త్రో చేయాలనే ఉద్దేశ్యంతో డికాక్‌ తన గ్లోవ్‌ను మైదానంలో ఉంచాడు. అయితే అదనంగా వచ్చిన బంతికి శుంబా పెవిలియన్‌కు చేరాడు.

ఎంసీసీ నిబంధనల ప్రకారం.. మైదానంలో బంతి వికెట్‌ కీపర్‌ హెల్మెట్‌కు గానీ, గ్లౌవ్‌లకు గానీ తాకితే అంపైర్ బ్యాటింగ్ జట్టుకు ఐదు పెనాల్టీ పరుగులను ఇస్తారు. అదే విధంగా ఆ బంతిని డెడ్‌బాల్‌గా అంపైర్‌లు ప్రకటిస్తారు.

A post shared by ICC (@icc)


చదవండి: T20 World Cup 2022: ప్రపంచకప్‌లో దారుణ ప్రదర్శన.. వెస్టిండీస్‌ హెడ్‌ కోచ్‌ రాజీనామా

Poll
Loading...
మరిన్ని వార్తలు