World cup 2023: వన్డేల్లో దక్షిణాఫ్రికా అత్యంత చెత్త రికార్డు..

5 Nov, 2023 22:05 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దక్షిణాఫ్రికా.. భారత్‌ చేతిలో ఘోర ఓటమి చవిచూసింది. కోల్‌కతా వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 243 పరుగుల తేడాతో సౌతాఫ్రికా పరాజయం పాలైంది. 327 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. భారత బౌలర్ల దాటికి 83 పరుగులకే తమ ఇన్నింగ్స్‌ను ముగించింది. 

టీమిండియా స్పిన్నర్‌ రవీంద్ర జడేజా 5 వికెట్లతో ప్రోటీస్‌ పతనాన్ని శాసించగా.. మహ్మద్‌ షమీ, కుల్దీప్‌ యాదవ్‌ రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఆరంభంలోనే డికాక్‌ను ఔట్‌ చేసి సఫారీలను చావుదెబ్బ కొట్టాడు. ప్రోటీస్‌ బ్యాటర్లలో జానెసన్‌(13) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. 

దక్షిణాఫ్రికా చెత్త రికార్డు..
ఈ మ్యాచ్‌లో ఘోర ఓటమి చవిచూసిన దక్షిణాఫ్రికా ఓ చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుం‍ది. అంతర్జాతీయ వన్డేల్లో పరుగుల పరంగా సౌతాఫ్రికా ఇదే అతిపెద్ద పరాజయం. ఇంతకుముందు 2002లో పాకిస్తాన్‌తో జరిగిన ఓ వన్డేలో 182 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఓటమి పాలైంది. ఇప్పటివరకు ఇదే అత్యధికం కాగా.. తాజా మ్యాచ్‌తో మరోసారి ఆప్రతిష్టతను ప్రోటీస్‌ మూటకట్టుకుంది.
చదవండి: మాకు ఎటువంటి స్సెషల్‌ ప్లాన్స్‌ లేవు.. అతడొక ఛాంపియన్‌! జడ్డూ కూడా: రోహిత్‌ శర్మ

మరిన్ని వార్తలు