T20 WC 2021: టీమిండియాపై పాక్‌ గెలుపు.. సంబురాలు చేసుకున్న టీచర్‌ తొలగింపు

26 Oct, 2021 18:41 IST|Sakshi

Teacher Expresses Joy Over Pakistan Win Against India Gets Expelled: టీ20 ప్రపంచకప్‌-2021లో టీమిండియాపై పాక్‌ 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ జిల్లాకు చెందిన నఫీసా అత్తారి అనే ప్రైవేట్‌ పాఠశాల ఉపాధ్యాయురాలు..  పాక్ క్రికెట్ జట్టు విజయం అనంతరం సంబురాలు చేసుకుని ఉద్యోగాన్ని కోల్పోయింది. స్థానికంగా ఉండే నీర్జా మోదీ అనే స్కూల్‌లో పనిచేసే నఫీసా.. పాక్‌ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తన వాట్సాప్‌లో స్టేటస్‌ పెట్టింది.


ఇందులో 'మేం గెలిచాం' అంటూ పాక్‌ ఆటగాళ్ల ఫోటోలు ఉంచింది. ఇది గమనించిన విద్యార్ధుల తల్లిదండ్రుల్లోని ఒకరు మీరు పాక్‌కు మద్దతిస్తున్నారా అని నఫీసాను ప్రశ్నించగా.. ఆమె అవునని సమాధానం చెప్పింది. దీంతో చిర్రెత్తిపోయిన సదరు తల్లిదండ్రులు..నఫీసా వాట్సాప్‌ స్టేటస్‌ స్క్రీన్‌షాట్‌లను సోషల్‌మీడియాలో షేర్‌ చేశారు. ఇది కాస్త వైరల్‌ కావడంతో పాఠశాల యాజమాన్యం నఫీసాను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ మేరకు టెర్మినేషన్ లెటరును  జారీ చేసింది. ఇది కూడా వైరల్‌ కావడంతో సర్వత్రా దీనిపై చర్చ నడుస్తుంది. 
చదవండి: T20 WC 2021: పాక్ విజయంపై ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు