T20 World Cup 2021:స్కాట్లాండ్‌కు వరుసగా రెండో విజయం

19 Oct, 2021 19:08 IST|Sakshi

స్కాట్లాండ్‌కు వరుసగా రెండో విజయం
పపువా న్యూ గినియాతో జరిగిన గ్రూఫ్‌ బి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ 17 పరుగులతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో స్కాట్లాండ్‌ క్వాలిఫయర్‌ పోటీల్లో వరుసగా రెండో విజయాన్ని అందుకొని సూపర్‌ 12 దశ అర్హతకు మరింత దగ్గరైంది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా న్యూ గినియా 20 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్‌ అయింది. నార్మన్‌ వనూహ 47 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. స్కాట్లాండ్‌ బౌలర్లలో జోష్‌ డేవీ 4 వికెట్లతో సత్తా చాటాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన స్కాట్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది.

పపువా టార్గెట్‌ 166.. 17 ఓవర్లలో 124/7
17 ఓవర్ల ఆట ముగిసేసరికి పపువా న్యూ గినియా 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. నోర్మన్‌ వానుహా 43 పరుగులతో ఆడుతున్నాడు. అంతకముందు 18 పరుగులు చేసిన కిప్లిన్‌ డొర్జియా స్టంప్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ఇక ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌లో 24 పరుగులు చేసిన సేసి బహు క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు.

పపువా టార్గెట్‌ 166.. 10 ఓవర్లలో 61/5
10 ఓవర్ల ఆట ముగిసేసరికి పపువా న్యూ గినియా 5 వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. సీసే బహు 23, నోర్మన్‌ వానుహా 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది.

166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పపువా న్యూ గినియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. 5 ఓవర్ల ఆటముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసింది.  అంతకముందు ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ మూడో బంతికి 2 పరుగులు చేసి ఓపెనర్‌ టోనీ ఉరా ఔటవ్వగా.. ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌ మూడో బంతికి మరో ఓపెనర్‌ లీగా సైకా 9 పరుగులు చేసి వీల్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

20 ఓవర్లలో స్కాట్లాండ్‌ 165/9.. పపువా టార్గెట్‌ 166
టి20 ప్రపంచకప్‌ 2021 క్వాలిఫయర్‌ పోటీల్లో భాగంగా గ్రూఫ్‌ బిలో పపువా న్యూ గినియాతో జరుగుతున్న మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. 26 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌ను మాథ్యూ క్రాస్‌(45), రిచీ బెరింగ్‌టన​(70) పరుగులతో నిలబెట్టారు. అయితే ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్‌ పెద్దగా రాణించలేకపోయారు. ఇక ఆఖరి ఓవర్లో స్కాట్లాండ్‌ నాలుగు వికెట్లు కోల్పోవడం విశేషం.

పపువా న్యూ గినియాతో జరుగుతున్న మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 45 పరుగులు చేసిన మాథ్యూ క్రాస్‌ సిమోన్‌ అతాయ్‌ బౌలింగ్‌లో చార్లెస్‌ అమినికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.అయితే ఓపెనర్లిద్దరు వెనుదిరిగిన తర్వాత మాథ్యూ క్రాస్‌, రిచీ బెరింగ్‌టన్‌(48*) ఇన్నింగ్స్‌ నడిపించారు. మూడో వికెట్‌కు 88 పరుగులు జోడించారు. ప్రస్తుతం స్కాట్లాండ్‌ 16 ఓవర్లు ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది.

10 ఓవర్లలో స్కాట్లాండ్‌ 67/2
10 ఓవర్ల ఆట ముగిసేసరికి స్కాట్లాండ్‌ 2 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. మాథ్యూ క్రాస్‌ 18, రిచీ బెర్రింగ్‌టన్‌ 24 పరుగులతో ఆడుతున్నారు.

రెండు వికెట్లు కోల్పోయిన స్కాట్లాండ్‌.. 5 ఓవర్లలో 33/2
పపువా న్యూ గినియాతో జరుగుతున్న మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ రెండు వికెట్లు కోల్పోయింది. 5 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 33 పరుగులు చేసింది. తొలుత 6 పరుగులు చేసిన కెప్టెన్‌ కోట్జెర్‌ పెవిలియన్‌ చేరగా.. తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్‌ జార్జ్‌ మున్సీ 15 పరుగులు చేసి వెనుదిరిగాడు.

అల్ అమెరాత్: టి20 ప్రపంచకప్‌-2021 క్వాలిఫయర్స్‌ పోటీల్లో భాగంగా గ్రూఫ్‌ బిలో నేడు స్కాట్లాండ్‌, పపువా న్యూ గినియా మధ్య మ్యాచ్‌ జరగనుంది. కాగా టాస్‌ గెలిచిన స్కాట్లాండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. బంగ్లాదేశ్‌పై సంచలన విజయం సాధించిన స్కాట్లాండ్‌ పపువాపై గెలిచి సూపర్‌ 12 దశకు అర్హత సాధించాలని ఉవ్విళ్లూరుతుంది.

పపువా న్యూ గినియా: టోనీ ఉరా, లెగా సియాకా, అస్సద్ వాలా (కెప్టెన్‌), చార్లెస్ అమిని, సెసే బౌ, సైమన్ అటాయ్, నార్మన్ వనువా, కిప్లిన్ డోరిగా (వికెట్‌ కీపర్‌), చాడ్ సోపర్, కబువా మోరియా, నోసైనా పోకానా

స్కాట్లాండ్ : జార్జ్ మున్సే, కైల్ కోట్జెర్ (కెప్టెన్‌), మాథ్యూ క్రాస్ (వికెట్‌ కీపర్‌), రిచీ బెర్రింగ్టన్, కాలమ్ మాక్లీడ్, మైఖేల్ లీస్క్, క్రిస్ గ్రీవ్స్, మార్క్ వాట్, జోష్ డేవి, బ్రాడ్లీ వీల్, అలాస్డైర్ ఎవాన్స్                    

మరిన్ని వార్తలు