IND Vs PAK: దారుణంగా విఫలమైన టీమిండియా టాప్‌ ఆర్డర్‌

24 Oct, 2021 20:17 IST|Sakshi
కేఎల్‌ రాహుల్‌

IND Vs Pak Top Order Failure.. టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్‌ కాకవికలం అయింది. ఎన్నో​ అంచనాలతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాహిన్‌ అఫ్రిది షాక్‌ ఇచ్చాడు. మొదట ఓపెనర్‌ రోహిత్‌ శర్మను గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌ చేర్చిన అఫ్రిది ఆ తర్వాతి ఓవర్‌లో కేఎల్‌ రాహుల్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. ఆ తర్వాత హసన్‌ అలీ బౌలింగ్‌లో కీపర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ సూపర్‌ క్యాచ్‌కు సూర్యకుమార్ యాదవ్ వెనుదిరిగాల్సి వచ్చింది. దీంతో టీమిండియా స్కోరు 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.


సూర్యకుమార్ యాదవ్


రోహిత్‌ శర్మ 

మరిన్ని వార్తలు