-

Neeraj Chopra: కల అనుకున్నా, ఇక్కడికొచ్చాకే అర్థమైంది

10 Aug, 2021 14:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టోక్యో  ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని గెల్చుకుని భారత్‌ అథ్లెట్స్‌లో వందేళ్ల కల సాకారం చేయడమే కాదు, అథ్లెటిక్స్‌లో ఒలింపిక్ స్వర్ణం గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచిన జావెలిన్ త్రో సంచలనం నీరజ్‌ చోప్రా(23) ఆనందంలో మునిగి తేలుతున్నాడు. బంగారు పతకం సాధించడం ఇంకా కలగానే ఉంది. ఏదో స్పప్నలోకంలో విహరిస్తున్న అనుభవం కలిగిందంటూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు.

ఒలింపిక్ క్రీడల్లో అథ్లెటిక్స్‌లో బంగారు పతకంతో  హీరోగా నిలిచిన నీరజ్‌ అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన మీడియా ఇంటరాక్షన్‌లో మంగళవారం మాట్లాడాడు. పతకాన్ని సాధించడం ప్రతీ అథ్లెట్‌ కల..అందులోనూ ఒలింపిక్ స్వర్ణం గెలవడం అంటే మామూలు విషయం కాదని నీరజ్‌ పేర్కొన్నాడు. అందుకే తాను బంగారు పతకాన్ని సాధించాను అన్న విషయాన్ని నమ్మలేకపోతున్నాను, కలగా ఉంది. దేశం కోసం గొప్ప పని చేశానని ఇండియాలో అడుగుపెట్టినపుడు, ఎయిర్‌పోర్ట్‌లో కోలాహలం చూసినపుడు మాత్రమే అర్థమైందన్నారు. భారత అథ్లెట్లలో ఆలోచన ఈసారి చాలా భిన్నంగా ఉందనీ, కేవలం పాల్గొనడంతోనే సరిపెట్టకుండా, అందరూ పతకం కోసం పోటీ పడ్డారని వ్యాఖ్యానించాడు.

(Naresh Tumda: రోజుకూలీగా మారిన క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ విన్నర్‌)

గత వారం టోక్యోలో 87.58 మీటరలు విసిరి పురుషుల ఫైనల్లో సంచలనాత్మక విజయాన్ని సాధించాడు నీరజ్‌ చోప్రా. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి భారత గడ్డ మీద అడుగుపెట్టిన నీరజ్ చోప్రాతోపాటు అథ్లెట్లు, ఇతర పతక విజేతలకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పానిపట్ ఖండ్రా గ్రామానికి చెందిన నీరజ్ చోప్రా  జావెలిన్ త్రోలో 87.58 మీటర్లు విసిరి తన ఒలింపిక్ రికార్డును బద్దలు కొట్టి భారతదేశానికి అథ్లెటిక్స్‌లో చారిత్రాత్మక మొదటి ఒలింపిక్ స్వర్ణాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

చదవండి : షాకింగ్‌: పార్కింగ్‌ టిక్కెట్లు విక్రయిస్తున్న యువ బాక్సర్‌

మరిన్ని వార్తలు