అనంతపురంలో సినీతారల క్రికెట్ మ్యాచ్...

11 Sep, 2022 14:25 IST|Sakshi

అనంతపురం నగరంలో సినీ తారలు సందడి చేశారు. నో డ్రగ్స్, నో ప్లాస్టిక్ క్యాంపెయిన్ లో భాగంగా టాలీవుడ్ స్టార్స్ క్రికెట్ మ్యాచ్‌ను ఆదివారం నిర్వహించారు. అనంతపురం పీటీసీ స్టేడియంలో  జరిగిన ఈ మ్యాచ్ లో సంపూర్ణేష్ బాబు, ఓంకార్, వరుణ్ సందేశ్, సామ్రాట్ సహా మొత్తం 45 మంది సినీ, జబర్దస్త్, బిగ్ బాస్ నటీనటులు పాల్గొన్నారు.

కాగా కార్యక్రమం క్రీసెంట్ క్రికెట్ కప్ నిర్వాహకులు షకిల్ షఫీ ఆద్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. కాగా మ్యాచ్‌ ప్రారంభానికి రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు మృతిపై ముందు సినీ నటులు, ప్రజాప్రతి నిధులు సంతాపం తెలిపారు.
చదవండి: Road Safety World Series: బిన్నీ ఊచకోత.. సౌతాఫ్రికాపై ఇండియా లెజెండ్స్ ఘన విజయం

మరిన్ని వార్తలు