ODI World Cup 2023: చరిత్ర సృష్టించిన ట్రెంట్ బౌల్ట్.. తొలి కివీస్‌ బౌలర్‌గా

9 Nov, 2023 16:15 IST|Sakshi

న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ ట్రెంట్ బౌల్ట్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో 50కు పైగా వికెట్లు సాధించిన తొలి న్యూజిలాండ్‌ బౌలర్‌గా బౌల్ట్‌ రికార్డులకెక్కాడు. వన్డే వరల్డ్‌కప్‌-2023లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో కుశాల్‌ మెండిస్‌ను ఔట్‌ చేసిన బౌల్ట్‌.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

వరల్డ్‌కప్‌లో టోర్నీలో బౌల్ట్‌ ఇప్పటివరకు 52 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా వన్డే వరల్డ్‌కప్‌ చరిత్రలో ఈ ఫీట్‌ సాధించిన మూడో లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌గా బౌల్ట్‌ నిలిచాడు. బౌల్ట్‌ కంటే ముందు లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్లు వసీం అక్రమ్‌, మిచిల్‌ స్టార్క్‌ ఈ ఘనత సాధించారు.

ఇక ఓవరాల్‌గా ఈ రికార్డు సాధించిన లిస్ట్‌లో బౌల్ట్‌ ఆరో స్ధానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా బౌలింగ్‌ దిగ్గజం గ్లెన్‌ మెక్‌గ్రాత్‌(71 వికెట్లు) అగ్రస్ధానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానాల్లో శ్రీలంక లెజెండ్‌ ముత్తయ్య మురళీ ధరన్‌(68), స్టార్క్‌(59), లసిత్‌ మలింగ(56), వసీం అక్రమ్‌(55) ఉన్నారు.
చదవండి: World cup 2023: శ్రీలంక ఆటగాడి మెరుపు ఇన్నింగ్స్‌.. వరల్డ్‌కప్‌లో ఫాస్టెస్ట్‌ ఫిప్టీ

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు