Womens U19 World Cup: ‘సూపర్‌ సిక్స్‌’ దశకు భారత్‌ అర్హత

19 Jan, 2023 07:21 IST|Sakshi

బెనోని (దక్షిణాఫ్రికా): తొలిసారి నిర్వహిస్తున్న అండర్‌–19 మహిళల టి20 ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నీలో భారత జట్టు లీగ్‌ దశను అజేయంగా ముగించింది. గ్రూప్‌ ‘డి’లో భాగంగా బుధవారం స్కాట్లాండ్‌ జట్టుతో జరిగిన చివరిదైన మూడో లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 85 పరుగుల తేడాతో నెగ్గింది. తద్వారా ఆరు పాయింట్లతో గ్రూప్‌ ‘డి’ టాపర్‌గా నిలిచి సూపర్‌ సిక్స్‌ దశకు అర్హత సాధించింది.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. టీమిండియాకు ఆడుతున్న తెలంగాణ అమ్మాయి, గొంగడి త్రిష (51 బంతుల్లో 59; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో ఆకట్టుకుంది. రిచా ఘోష్‌ (35 బంతుల్లో 33; 3 ఫోర్లు) కూడా రాణించింది.

అనంతరం 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్‌ 13.1 ఓవర్లలో 66 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. భారత బౌలర్లు మన్నత్‌ కశ్యప్‌ (4/12), అర్చన దేవి (3/14), సోనమ్‌ యాదవ్‌ (2/1) స్కాట్లాండ్‌ను దెబ్బ తీశారు.
చదవండిWomens U19 World Cup: హైదరాబాద్‌ అమ్మాయికి బంపరాఫర్‌.. భారత జట్టులో చోటు

మరిన్ని వార్తలు