T20 WC 2022: కోహ్లిని ప్రశంసలతో ముంచెత్తిన బీసీసీఐ కొత్త బాస్‌

29 Oct, 2022 13:39 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో పాక్‌తో మ్యాచ్‌ ముగిసి దాదాపు వారం గడుస్తున్నా.. ఆ మ్యాచ్‌ తాలూకా స్మృతులు క్రికెట్‌ అభిమానులను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. భారత అభిమానులైతే ఈ మ్యాచ్‌ జ్ఞాపకాలను చిరకాలం గుర్తుపెట్టుకుంటారు. అంతలా ఆ మ్యాచ్‌ ప్రభావం ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌పై చూపింది. అందరు క్రికెట్‌ అభిమానుల్లాగే ఈ మ్యాచ్‌ భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) నూతన అధ్యక్షుడు రోజర్‌ బిన్నీని కూడా అమితంగా ఆకట్టుకుంది.

ఈ మ్యాచ్‌లో కోహ్లి వీరోచిత ఇన్నింగ్స్‌కు బీసీసీఐ బాస్‌ ముగ్దుడైపోయాడు. విరాట్‌ కొట్టుడు ఓ కలలా అనిపించిందని ప్రశంసలతో ముంచెత్తాడు. దాయాదుల సమరం క్రికెట్‌ ప్రపంచానికి అసలుసిసలైన టీ20 క్రికెట్‌ మజాను అందించిందని అన్నాడు. ముఖ్యంగా కోహ్లి ఇన్నింగ్స్‌ న భూతో న భవిష్యత్‌ అన్న రీతిలో సాగిందని కొనియాడాడు.

కోహ్లి ఆడిన ఇన్నింగ్స్‌ అసాధారణమైనదని అభివర్ణించాడు. ఒత్తిడి సమయాల్లో కోహ్లి మరింత మెరుగ్గా ఆడతాడని ఈ ఇన్నింగ్స్‌ ద్వారా మరోసారి నిరూపితమైందని కితాబునిచ్చాడు. క్రికెట్‌లో కోహ్లి నిరూపించుకోవాల్సింది ఇంక ఏమీ లేదని, అతని ఈ ఇన్నింగ్స్‌ ఒక్కటి చాలు అతనేంటో ప్రపంచానికి తెలియడానికంటూ ఆకాశానికెత్తాడు. ఛేదనలో కోహ్లినే రారాజని ఈ ఇన్నింగ్స్‌ మరోసారి క్రికెట్‌ సమాజానికి చాటాచెప్పిందని ప్రశంసించాడు. 

కర్ణాటక క్రికెట్‌ అసోసియేషన్‌ (కేసీఏ) ఏర్పటు చేసిన సన్మాన సభలో బిన్నీ ఈ మేరకు కోహ్లిని, పాక్‌పై భారత్‌ సాధించిన విజయాన్ని కొనియాడాడు. ఈ సందర్భంగా బిన్నీ తన సొంత రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌పై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. తాను బీసీసీఐ అధ్యక్షుడు కావడానికి తోడ్పడిన కేసీఏకి కృతజ్ఞతలు తెలిపాడు.  కేసీఏకు తాను జీవితకాలం రుణపడి ఉంటానిని అన్నాడు. కేసీఏతో తన అనుబంధం  50 ఏళ్ల నాటిదని గుర్తు చేశాడు. 

Poll
Loading...
మరిన్ని వార్తలు