‘పాక్‌ పని అయిపోయింది! వచ్చే వారం టీమిండియా కూడా!’.. నీకంత సీన్‌ లేదులే

28 Oct, 2022 17:00 IST|Sakshi

ICC Mens T20 World Cup 2022 - Shoaib Akhtar: పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ మరోసారి టీమిండియా ఫ్యాన్స్‌ ఆగ్రహానికి గురయ్యాడు. ‘‘మీ జట్టు విషయంలో మాత్రమే నీ అంచనాలు నిజమవుతాయిలే!’’ అంటూ అతడిని ట్రోల్‌ చేస్తున్నారు భారత అభిమానులు. కాగా టీ20 ప్రపంచకప్‌-2022లో పాకిస్తాన్‌తో ఆరంభ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి దంచికొట్టిన విషయం తెలిసిందే.

82 పరుగులతో అజేయంగా నిలిచిన కింగ్‌ జట్టును గెలిపించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌ తర్వాత షోయబ్‌ అక్తర్‌ స్పందిస్తూ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడని ప్రశంసిస్తూనే.. ఇక టీ20లకు అతడు గుడ్‌ బై చెప్పాలంటూ సలహా ఇచ్చాడు. దీంతో కింగ్‌ ఫ్యాన్స్‌ అతడిపై ఫైర్‌ అయిన విషయం తెలిసిందే.

టీమిండియాను ఉద్దేశించి
ఇక ఇప్పుడు అక్తర్‌ టీమిండియాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు భారత అభిమానులకు అతడు టార్గెట్‌ అయ్యేలా చేశాయి. కాగా జింబాబ్వేతో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఒక్క పరుగు తేడాతో ఓడి సెమీస్‌ చేరే అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కెప్టెన్‌ బాబర్‌ ఆజంను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసిన అక్తర్‌.. టీమిండియా సెమీస్‌ అవకాశాలపై కూడా స్పందించాడు.

వచ్చే వారం వాళ్లు కూడా అవుట్‌!
ఈ మేరకు ఈ రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్‌ మొదటి వారంలోనే టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదంలో పడుతుందని నేను ముందే చెప్పాను. ఇక వచ్చే వారం ఇండియా వంతు! వాళ్లు కూడా టోర్నీ నుంచి అవుట్‌ అవుతారు. వాళ్లు సెమీస్‌ ఆడతారేమో గానీ.. తీస్‌ మార్‌ ఖాన్‌ మాత్రం కాలేరు’’ అని పేర్కొన్నాడు. 

ఇప్పటికే రెండు విజయాలతో 4 పాయింట్లతో గ్రూప్‌-2 టాపర్‌గా ఉన్న రోహిత్‌ సేన సెమీస్‌ చేరడం లాంఛనమే అని చెప్పొచ్చు. అంతేకాదు కోహ్లి, సూర్య సూపర్‌ ఫామ్‌లో ఉండటం సహా భువనేశ్వర్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ మెరుగ్గా రాణిస్తున్నారు. ఇలాంటి సానుకూల అంశాల నేపథ్యంలో ఈసారి టీమిండియా ట్రోఫీ గెలిచే అవకాశాలు ఎక్కువేనన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో అక్తర్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీంతో నీకంత సీన్‌ లేదంటూ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: Pak Vs Zim: పాక్‌ గడ్డ మీద పుట్టి పాక్‌నే ఓడించాడు! ‘ఈసారైనా మోసం చేయకండి’! ఈ మిస్టర్‌ బీన్‌ గోలేంటి?
T20 WC 2022 Paul Van Meekeren: క్రికెట్‌ ఆడితేనే డబ్బులు.. లేదంటే పస్తులు
Ind Vs Ned: నాటి వరల్డ్‌కప్‌లో తండ్రి సచిన్‌ వంటి దిగ్గజాల వికెట్లు తీసి.. నేడు కొడుకు మాత్రం..

Poll
Loading...
మరిన్ని వార్తలు