అతడు ఆద్భుతమైన ఆటగాడు: ఇర్ఫాన్‌ పఠాన్‌

24 Sep, 2021 16:57 IST|Sakshi
Courtesy: IPL.Com

Irfan Pathan and Hayden Comments ON Venkatesh iyer: ఐపీఎల్‌ ఫేజ్‌2లో చేలరేగి ఆడుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ యువ ఓపెనర్‌ వెంకటేష్ అయ్యర్‌పై మాజీలు, క్రికెట్‌ నిపుణులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్‌ పఠాన్‌, మాథ్యూ హెడెన్ కూడా వెంకటేష్ అయ్యర్‌ను అభినందించారు. భవిష్యత్తులో అయ్యర్‌ నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఎన్నో చూడవచ్చు అని పఠాన్‌ ప్రశంసించాడు.   " తన మొదటి మ్యాచ్‌లో అయ్యర్‌ విశ్వరూపం చూపించాడు. అతడు కొన్ని షాట్‌లు, కవర్ డ్రైవ్లు బాగా ఆడాడు. భవిష్యత్తులో అయ్యర్‌ నుంచి మంచి ఇన్నింగ్స్‌లు ఆశించవచ్చు’’ అని స్టార్ స్పోర్ట్స్ పోస్ట్-మ్యాచ్ షోలో భాగంగా ఇర్ఫాన్‌ పఠాన్‌ పేర్కొన్నాడు.

ముంబై ఇండియన్స్ బౌలింగ్ విభాగంలో ప్రపంచ స్థాయి బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే ఉన్నారు. అయినప్పటికీ వాళ్ల బౌలింగ్‌ను అయ్యర్‌ అలవోకగా ఎదుర్కొన్నాడు అని పఠాన్‌ తెలిపాడు. మరో వైపు ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ మాథ్యూ హేడెన్ ఫన్నీగా అతడిని ప్రశంసించాడు. "అతడు క్రికెట్ ఆడటానికి తన తల్లి నుంచి అనుమతి పొందాడు. తల్లి మాట విన్న వారు అద్భుతాలు సృష్టిస్తారు. ఎందుకంటే మిత్రులారా.. మనమందరం అదే కోవకు చెందిన వాళ్లం కదా ”అని హేడెన్ చెప్పాడు.

చదవండిన్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌లు పాక్‌ పర్యటన రద్దు చేసుకోవడంపై మండిపడ్డ ఆసీస్‌ ఓపెనర్‌

మరిన్ని వార్తలు