కొత్తపేట్‌ పండ్ల మార్కెట్‌ మూసివేతకు ముహూర్తం ఖరారు

24 Sep, 2021 16:59 IST|Sakshi

అక్టోబర్‌ 1 నుంచి బాటసింగారంలో మార్కెట్‌ కార్యకలాపాలు

సాక్షి, హైదరాబాద్‌: కొత్తపేట్‌ పండ్ల మార్కెట్‌ తరలింపునకు ముహూర్తం ఖరారైంది. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి బాటసింగారంలో మార్కెట్‌ కార్యకలపాలు ప్రారంభిస్తున్నారు. ఈ మేరకు గురువారం మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌  ముత్యంరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ నెల 25వ తేదీ అర్థరాత్రి నుంచి కొత్తపేట పండ్ల మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు తీర్మానించామన్నారు.

ఇప్పటికే కొత్తపేట్‌ పండ్ల మార్కెట్‌ స్థలంలో ఆసుపత్రి నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నెల 25వ తేదీ నుంచి అక్టోబర్‌ 1వ తేదీ వరకు మార్కెట్‌ తరలింపు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇందుకు రైతులు, వ్యాపారులు మార్కెట్‌కు సరుకులు తీసుకురావొద్దని కోరారు. బాటసింగారంలో మార్కెట్‌ కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. రైతులకు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
చదవండి: స్వచ్ఛమైన గాలి కావాలా?.. అక్కడికి వెళ్లాల్సిందే..

మరిన్ని వార్తలు