నిమ్స్‌కు రూ.1,800 కోట్ల రుణం మంజూరు 

29 Aug, 2023 06:23 IST|Sakshi

లక్డీకాపూల్‌ (హైదరాబాద్‌): నిజాం వైద్య విజ్ఞా న సంస్థ (నిమ్స్‌) విస్తరణ పనులకు రూ. 1,800 కోట్లు రుణాన్ని మహారాష్ట్ర బ్యాంక్‌ మంజూరు చేసింది. నిమ్స్‌ ఆస్పత్రి విస్తరణలో భాగంగా నిర్మించతలపెట్టిన 2 వేల పడకల దశాబ్ది బ్లాక్‌కు సీఎం కేసీఆర్‌ జూన్‌ 14న భూమి పూజ చేశారు. నిమ్స్‌కు కేటాయించిన 33 ఎకరాల్లో విస్తరణ పనుల్లో భాగంగా కొత్తగా మూడు భవనాలను నిర్మించనున్నారు.

ఇందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు టెండర్ల ప్రక్రియను చేపట్టారు. ఈనెల 31న టెండర్లను ఖరారు చేయనున్నారు. అందులో భాగంగా మహారాష్ట్ర బ్యాంక్‌ రుణ సదుపాయాన్ని కల్పించింది. ఈ రుణ మొత్తాన్ని నిమ్స్‌ నిరీ్ణత కాల వ్యవధిలో బ్యాంక్‌కు చెల్లించాల్సి ఉంది. పేదలకు మరింత మెరుగైన సేవలు అందించేందు కు చేస్తున్న కృషిలో భాగంగా విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఇందుకు నిమ్స్‌ ప్రత్యేకంగా ఓ రిటైర్డ్‌ ఆర్‌అండ్‌బీ చీఫ్‌ ఇంజనీర్‌ లక్ష్మారెడ్డిని నియమించిన సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు