కాంగ్రెస్‌లో చేరిన శోభారాణి

30 May, 2022 02:48 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అమెరికాలోని ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్య క్రమంలో శోభారాణి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ సీని యర్‌ నేత మధుయాష్కీ గౌడ్‌ ఆధ్వర్యంలో ఆమె కాంగ్రెస్‌ తీర్థం పుచ్చు కున్నారు.

ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీ నేతృ త్వంలో కాంగ్రెస్‌ విధానాలను నమ్మి ప్రజల దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకుని శోభారాణి పార్టీలో చేరినట్లు తెలిపారు. అమెరికాకు వెళ్లేముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాజీనామా పంపించినట్లు ఆయన తెలిపారు. 

భిక్షమయ్య చేరికతోనే..: కొన్నిరోజుల క్రితమే ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్‌ టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరారు. దీంతో ఈ నియోజకవర్గం నుంచే టికెట్‌ ఆశిస్తున్న శోభారాణి బీజేపీలో తనకు అవకాశం లేదని అంచనాకు వచ్చే కాంగ్రెస్‌లో చేరినట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు