50 వేల టీచర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వాలి 

23 Sep, 2021 09:08 IST|Sakshi
ఆర్‌.కృష్ణయ్య (ఫైల్‌)

సాక్షి, ముషీరాబాద్‌(హైదరాబాద్‌): ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 50 వేల టీచర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో బుధవారం బీసీ సంఘం నేత గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన బీఈడీ, డీఈడీ, పీఈటీ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్యలు తీసుకుంటున్న మాదిరిగానే టీచర్‌ పోస్టులను భర్తీకి కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏపీలో నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను తీ ర్చిదిద్ది పేద, బడుగు, బలహీన వర్గాలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను అందంగా తీర్చిదిద్దుతున్నారని, వేలకోట్లను వెచ్చిస్తున్నా రని తెలిపారు.

ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల ముందు నో వేకెన్సీ బోర్డులు దర్శనం ఇస్తున్నాయన్నారు. అదే పరిస్థితి తెలంగాణలో కూడా తీసుకురావాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో లాల్‌కృష్ణ, లక్ష్మణ్‌యాదవ్, అంజి, సత్యనారాయణ, అనంతయ్య, సతీశ్, చంటి ముదిరాజ్, సుచిత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.   

చదవండి: దళితబంధును వదులుకున్న సిసలైన శ్రీమంతులు..

>
మరిన్ని వార్తలు