తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా

21 Dec, 2023 19:31 IST|Sakshi

First Session of Third Telangana Legislative Assembly Day 6 Live Updates

తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా

బీజేపీ వస్తే ఊరుకోం: ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి

  • మొన్నటివరకు బీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉంది.
  • ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం పోయింది కాబట్టి ఎంఐఎం కాంగ్రెస్ అంటుంది.
  • బీజేపీకి ఎంఐఎంకి ఎలాంటి సంబంధం లేదు.
  • కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు వాస్తవం లేదు.
  • మీరు ఏమైనా చేసుకోండి బీజేపీ జోలికి వస్తే మర్యాదగా ఉండదు.

 విషయం తెలుసుకుని మాట్లాడాలి: హరీష్‌ రావు

  • సిద్దిపేట, గజ్వేల్‌లో విద్యుత్ బకాయిలు ప్రజలు కట్టకుండా ఉన్నవి కావు.
  • అక్కడ ఉన్న ప్రభుత్వ ప్రాజెక్టుల బకాయిలు ఉన్నవి అన్నది సీఎం తెలుసుకోవాలి.
  • తెలంగాణ విషయంలో కాంగ్రెస్ మోసం చేస్తేనే టీడీపీతో ఆనాడు పొత్తు పెట్టుకున్నాం.
  • కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న టీడీపీతో పొత్తు పెట్టుకున్నా తెలంగాణ కోసమే.
  • సీఎం రేవంత్ రెడ్డి పదవుల కోసం పార్టీలు మారాడు.
  • జూబ్లీహిల్స్ ప్రజలను అవమానపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌ వల్లే తెలంగాణ వచ్చింది: పొన్నం

  • తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీనే. 
  • తెలంగాణ కోసం ఆనాడు పార్లమెంట్లో ఎంపీలుగా మేము కొట్లాడం, కేసీఆర్ లేడు.
  • సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చినటువంటి నేత.
  • కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి స్వరాష్ట్ర కల నెరవేరింది.
  • తెలంగాణ కోసం పోరాడితే బతికుండగానే నాకు పిండ ప్రధానం చేసిన నాయకులు వాళ్లు.
  • కేంద్రం నుంచి అన్ని అనుమతులు వచ్చినా గత పదిహేళ్లుగా అధికారంలో ఉండి ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు.
  • ఎంపీగా కేసీఆర్‌ను గెలిపిస్తే కరీంనగర్ ప్రజలకు ప్రాజెక్టు ఎందుకు కంప్లీట్ చేయలేదు?
  • తెలంగాణ కోసం చర్మం ఒలిచి చెప్పులు కుట్టిస్తా అన్న కేసీఆర్ కరీంనగర్‌లో ప్రాజెక్టు ఎందుకు కంప్లీట్ చేయలేదు?

శ్వేత పత్రంపై స్పందించిన కేటీఆర్.

  • పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే 24 గంటల కరెంటు ఇవ్వలేమంటూ శ్వేత పత్రం విడుదల చేసిన అసమర్ధ పార్టీ.
  • విద్యుత్ శాఖను 22వేల కోట్ల నష్టాల్లో అప్పజెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా?
  • నేదునూరు శంకర్‌పల్లిలో ధర్నా చేసింది మేమే.
  • ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పిండం పెడతా అన్నాడు.
  • దేశంలో గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులు ఎక్కడా సక్సెస్ కాలేదు.
  • కేంద్రం అనుమతి ఇవ్వలేదు కాబట్టే నేదునూరులో ప్రాజెక్టు టేకప్ చేయలేదు.
  • ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీనే ఉంది నేదునూరులో ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ టేకప్ చేయాలి.
  • నేదునూరు ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ప్రకటన సభలో చేయాలి.

మేం ఎవరికీ భయపడం: అక్బరుద్దీన్‌

  • విద్యుత్‌ అప్పులపై అసెంబ్లీలో చర్చ.
  • స్పీకర్‌ వెల్‌లోకి ఎంఐఎం సభ్యులు
  • కిరణ్‌ కుమార్‌రెడ్డి జైల్లో పెట్టినా భయపడలేదు: అక్బరుద్దీన్‌
  • కాంగ్రెస్‌ మమ్మల్ని అణచివేసే ప్రయత్నం చేస్తుంది.

అక్బరుద్దీన్‌ ఎంత సేపు మాట్లాడినా మాకు ఇబ్బంది లేదు: రేవంత్‌ రెడ్డి

  • అక్బరుద్దీన్‌ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
  • ఆయన అనుభవాన్ని పరిగణలోకి తీసుకొన ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేశాం.
  • బీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ మిత్రులమని కేసీఆర్‌ చెప్పారు.
  • ఓల్డ్‌ సిటీ, న్యూసిటీ అనే తేడా మాకు లేదు.
  • అక్బరుద్దీన్‌ మజ్లిస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాత్రమే.
  • ముస్లిం అందరికీ నాయకుడు కాదు.
  • జూబ్లీహిల్స్‌లో అజారుద్దీన్‌కు టికెట్‌ ఇస్తే మజస్లిస్‌ ఓడించే ప్రయత్నం చేసింది.
  • కామారెడ్డిలో షబ్బీర్‌ అలీని ఓడించడానికి  కేసీఆర్‌, అక్బరుద్దీన్‌ కలిసి పని చేశారు.

విద్యుత్‌ రంగంపై చర్చ

  •  విద్యుత్‌ను బీఆర్‌ఎస్‌ నేతలే కనుగొన్నట్లు మాట్లాడుతున్నారు: పాయల్ శంకర్.
  •  2014కు ముందు రాష్ట్రంలో అసలు విద్యుత్‌ లేనట్లుగా.. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే కరెంట్ వచ్చినట్లు మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతున్నారు.
  • విద్యుత్ సంస్థల నష్టాలు చూస్తే ప్రజలు భయపడుతున్నారు.
  • విద్యుత్‌ వ్యవస్థ మెరుగ్గా ఉండాల్సిందే.
  • 200 యూనిట్ల ఉచిత కరెంట్‌ ఎప్పటి నుంచి ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి.

తెలంగాణ శాసనసభలో పవర్‌ పంచాయితీ

  • తెలంగాణ ప్రస్తుత విద్యుత్‌ రంగ పరిస్థితిపై కాంగ్రెస్‌ సర్కార్‌ శ్వేత పత్రం విడుదల
  • రూ.81 వేల కోట్ల బకాయిలున్నాయన్న డిప్యూటీ సీఎం భట్టి
  • గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలన వల్లే ఈ పరిస్థితంటూ ఆక్షేపణ
  • అప్పులతో ఆస్తులు పెంచామన్న మంత్రి జగదీష్‌రెడ్డి
  • పక్కదారి పట్టిన విద్యుత్‌ రంగంపై స్వల్పకాలిక చర్చ
  • బీఆర్‌ఎస్‌ హయాంలో విద్యుత్‌ రంగం అవినీతి చేసిందని కోమటిరెడ్డి విమర్శలు
  • జగదీష్‌రెడ్డిపైనా అవినీతి ఆరోపణలు
  • సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమంటూ జగదీష్‌రెడ్డి సవాల్‌
  • సవాల్‌ స్వీకరించిన సీఎం రేవంత్‌రెడ్డి
  • మూడు అంశాలపై విచారణకు ఆదేశం
  • విచారణకు రెడీ అంటూ ధీటుగా స్పందించిన జగదీష్‌రెడ్డి
  • కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఆరోపణలకు కౌంటర్‌ 
  • ఈ క్రమంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌పై వ్యక్తిగత విమర్శలు చేసిన జగదీష్‌రెడ్డి
  • తీవ్రంగా స్పందించిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
  • సభా గౌరవం కాపాడలంటూ కోరిన మాజీ స్పీకర్‌ పోచారం, ప్రస్తుత స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌   


ఇంకా బీజేపీపై తప్పుడు ప్రచారమేనా?

  • విద్యుత్‌ రంగంపై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
  • విద్యుత్ సంస్థలను బీఆర్ఎస్ ప్రభుత్వం  పీకల్లోతు నష్టాల్లోకి నెట్టాయి
  • ధర్నాలు లేవని మాజీ మంత్రి చెప్తున్నారు.. అసలు  ధర్నా చేసే ఆలోచన చేస్తేనే అరెస్ట్ చేశారు కదా!
  • రెండు వందల యూనిట్ల కరెంటు ఎప్పటి నుంచి ఫ్రీ గా ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి
  • డిస్కం లకు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా నిధులు సకాలంలో చెల్లించాలి
  • కేంద్ర ప్రభుత్వం సహాయం చేసిందని స్వయంగా కేసీఆర్ ఒప్పుకున్నారు
  • అయినా బీఆర్ఎస్, బీజేపీపై గ్లోబెల్ ప్రచారం చేస్తోంది
  • ఎవరు ఎంత కరెంటు వాడుతున్నారో లెక్కలు తేల్చేందుకే మీటర్లు
  • కానీ బిల్లు వసూలు కోసమే అని బీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేశారు
  • అప్పులు చేయకుండా కాంగ్రెస్ హామీలు అమలు చేయడం సాధ్యమా?
  • సౌత్, నార్త్ గ్రిడ్ లను కలిపింది కేంద్ర ప్రభుత్వమే.. అయినా ఈ విషయాన్ని  గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం చెప్పడం లేదు


తెలంగాణ శాసనసభకు స్వల్ప విరామం

సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు?

  • సీడబ్ల్యూసీ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లాల్సిన టీపీసీసీ చీఫ్‌, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
  • ఇంకా అసెంబ్లీలోనే సీఎం రేవంత్‌
  • మధ్యాహ్నాం ఫ్లైట్‌ మిస్‌ కావడంతో మరో విమానం కోసం ప్రయత్నించిన సీఎంవో!
  • విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రం.. స్వల్పకాలిక చర్చతో వేడెక్కిన శాసనసభ
  • ప్రస్తుత పరిణామాలతో ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న సీఎం రేవంత్‌రెడ్డి
  • సభలోనే ఉండాలని నిర్ణయించుకున్న ముఖ్యమంత్రి?

ఆనాడు ఏమైపోయారు మీరంతా?: రాజగోపాల్‌రెడ్డి

  • తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
  • గతంలో సభలో మంత్రిగా ఉండి ఎర్రబెల్లి దయాకర్ రావు నన్ను ఉరికించి కొడతానన్నారు
  • ఆరోజు నన్ను ఒక మంత్రి అలా అన్నప్పుడు ఎక్కడికి పోయారు మీరంతా?


సభ్యుల తీరుపై స్పీకర్ అభ్యంతరం

  • శాసనసభలో నేటి పరిణామాలపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ అభ్యంతరం
  • వ్యక్తిగత దూషణలకు సభలో అవకాశం లేదు
  • సభలో ఉన్న ప్రతీ సభ్యుడు సభా మర్యాదను కాపాడాలి
  • వ్యక్తిగత దూషణలు చేసిన అంశాలపై పరిశీలన చేస్తాం

‘ఖబడ్దార్’పై జగదీష్ రెడ్డి అభ్యంతరం

  • బీఆర్‌ఎస్‌ సభ్యుల్ని ఉద్దేశిస్తూ.. తన జోలికి రావొద్దని, ఖబడ్దార్‌ అని హెచ్చరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
  • రాజగోపాల్‌ వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుబట్టిన మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి
  • సభలో ఖబర్దార్ లాంటి పదాలు వాడొచ్చా? అని స్పీకర్‌కు జగదీష్‌రెడ్డి ప్రశ్న 
  • ఖబర్దార్ అని స్పీకర్ చైర్ ను అన్నారా? మమ్మల్ని అన్నారా? అని నిలదీత
  • నేను వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదు విమర్శలు చేయలేదు
  • నాపై వ్యక్తిగత విమర్శలు చేసిన వ్యాఖ్యలను తొలగించాలి
  • ఖబడ్దార్‌ అన్నందుకు ఆ సభ్యుడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు స్పీకర్ చెప్పాలి


 

శాసనసభలో రగడ

  • కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ నిరసన
  • స్పీకర్‌ పోడియం ముందుకు వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
  • సభలో బెదిరిస్తున్నారని రాజగోపాల్ రెడ్డిపై బీఆర్ఎస్ మండిపాటు


ఖబడ్దార్‌..: రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే

  • నేను పార్టీలు మారిన టైంలో పదవికి రాజీనామా చేశా
  • దొంగల లెక్క పదవుల కోసం పార్టీలు నేను మారలేదు
  • నా జోలికి వస్తే ఊరుకునేది లేదు
  • ఖబర్దార్ ఏమనుకుంటున్నారో?


సభామర్యాదను కాపాడండి: పోచారం రిక్వెస్ట్‌

  • సభా మర్యాదను కాపాడుకుందాం 
  • ఒకరి పైన ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోవద్దు
  • సభలోకి కొత్త సభ్యులు చాలామంది వచ్చారు
  • మాజీ స్పీకర్‌గా.. సభ ఉందాగా నడపాలని కోరుకుంటున్నా
  • వ్యక్తిగత విమర్శలు ఏమైనా ఉంటే బయట విమర్శలు చేసుకోవాలి
  • సభకు సహకరించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం

జగదీష్‌రెడ్డికి రాజగోపాల్ చురకలు

  • అధికారంలో పర్మినెంట్‌గా ఉంటాం అనుకున్న బీఆర్ఎస్కు ప్రజలిచ్చిన షాక్‌తో మతిభ్రమించింది
  • అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ నేతల తీరు మారడం లేదు
  • పార్టీలు మారామని మా బ్రదర్స్ ని విమర్శిస్తున్న వాళ్లకు.. వాళ్ల అధినేత కేసిఆర్ ఎన్ని పార్టీలు మారారో తెలియదా?
  • నాలుగు రూపాయలకు దొరికే పవర్ ని.. ఆరు రూపాయలకు పెంచి గత ప్రభుత్వం తప్పు చేసింది
  • రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి ఆలోచన చేస్తే జాలేస్తోంది
  • కిరసనాయిలు దీపం, కిరాయి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి రూ. 1000 కోట్ల హైదరాబాద్‌ బంగ్లా ఎలా సంపాదించారు ?
  • నేను పార్టీలు మారింది ప్రజల కోసమే.. పదవుల కోసమో, పైసల కోసమో కాదు
  • మాజీ ముఖ్యమంత్రి ముందు ఆ పార్టీ నాయకులు మాట్లాడి ధైర్యం ఉందా?
  • మాజీ ముఖ్యమంత్రి ముందు ధైర్యంగా మాట్లాడలేదు కాబట్టే రాష్ట్రం అప్పుల పాలు అయింది

ఇలాగే ఉంటా.. మీలాగా కాదు: మాజీమంత్రి జగదీష్ రెడ్డి

  • నన్ను ఎంత రెచ్చగొట్టినా వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడను
  • సభలోనే కాదు బయట కూడా వ్యక్తిగత ఆరోపణలు నేను చేయను అలవాటు నాకు లేదు
  • అవసరాల కోసం.. పదవుల కోసం నేను విమర్శలు ఆరోపణలు చేయను
  • పార్టీలు మారే క్యారెక్టర్ నాది కాదు
  • కాంట్రాక్టుల కోసం పార్టీలు మారిన చరిత్ర ఆ సోదరులదిది(కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఉద్దేశించి..)
  • విద్యుత్ పై విడుదల చేసిన శ్వేత పత్రం తప్పులు తడకగా ఉంది
  • కేసీఆర్‌ ఇచ్చినట్లే 24 గంటల కరెంటు ఇస్తారా లేదా సభ సాక్షిగా క్లారిటీ ఇవ్వాలి
  • మీటర్లు పెట్టకుండా కరెంటు ఇస్తారా? లేదా? అనేది స్పష్టం చేయాలి 
  • మేనిఫెస్టోలో చెప్పినట్లు ఉచిత విద్యుత్ ఇస్తారా లేదా? అనే దానిపై సభాముఖంగా ప్రకటన చేయాలి
  • భవిష్యత్తులో అప్పులు చేయకుండా విద్యుత్ ఇస్తారా లేదా అని కూడా చెప్పాలి

రాజగోపాల్‌ మైక్‌ అందుకోవడంతో రగడ

  • తెలంగాణ శాసనసభలో విద్యుత్‌ రంగంపై స్వల్ఫకాలిక చర్చ
  • మంత్రులు మాట్లాడుతుండగా.. మైక్‌ అందుకున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
  • రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగవడం ఖాయం: రాజగోపాల్ రెడ్డి
  • బీఆర్ఎస్ నాయకులను బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేరు: రాజగోపాల్ రెడ్డి
  • విద్యుత్ శాఖలో అవినీతిపై జ్యుడిషియల్ ఎంక్వయిరీ వేసినందుకు సీఎంకు ధన్యవాదాలు: రాజగోపాల్ రెడ్డి
  • విచారణలో అన్ని బయటకు వస్తాయి: రాజగోపాల్ రెడ్డి
  • రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుండగా పోడియం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
  • ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డికి ఎలా అవకాశం ఇస్తారంటూ స్పీకర్‌ను ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

  • బీఆర్‌ఎస్‌ హయాంలో విద్యుత్‌ రంగంలో భారీ అవినీతి జరిగింది
  • విద్యుత్ శాఖలో అవినీతిపై జ్యుడీషియల్ ఎంక్వయిరీకి ఆదేశించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు
  • జగదీష్ రెడ్డి గతంలో పవర్ లేని పవర్ శాఖ మంత్రిగా పనిచేశారు
  • ఆయన విద్యుత్ మంత్రి కాదు యాదాద్రి పవర్ ప్లాంట్ లో సబ్ కాంట్రాక్టర్
  • విచారణలో అన్నీ వెలుగు చూస్తాయి
  • ఇదంతా ఆన్‌ రికార్డు చెబుతున్నా
  • మాజీ అధికారి ప్రభాకర్‌రావు, మాజీ మంత్రి జైలుకు పోవడం ఖాయం
     

నేనూ సిద్ధం: మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి

  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రసంగంపై మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అభ్యంతరం
  • రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తే.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం భరించలేకపోతోంది
  • కాంగ్రెస్‌ హయాంలో కరెంట్‌ కోతలపై ధర్నాలు జరిగాయి
  • కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు నాలుగు గంటలు కూడా కరెంట్‌ ఇవ్వలేదు
  • రైతుల గురించి కాంగ్రెస్‌ ఏనాడూ ఆలోచించలేదు.. వాళ్ల వైపు లేదు
  • కాంగ్రెస్‌ పార్టీ వాళ్లు పెట్టుబడి దారుల వైపు ఉన్నారు
  • కేసీఆర్‌ రైతుల పక్షపాతి
  • విద్యుత్‌ రంగంపై ఎలాంటి విచారణ అయినా జరిపించుకోండి.. అందుకు నేను సిద్ధం 
  • ఈఆర్సీ రూల్స్‌ ప్రకారమే Electricity Regulatory Commission విద్యుత్‌ను కొనుగోలు చేశాం
  • విద్యుత్‌ కొనుగోళ్లపై కాగ్‌ నివేదికలు కూడా ఉన్నాయి

విద్యుత్‌పై జ్యూడీషియల్‌ విచారణకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి

  • ఆనాటి ప్రభుత్వం ఏనాడూ సభ ముందు వాస్తవాలు బయటపెట్టలేదు
  • విద్యుత్‌ శాఖను పూర్తిస్థాయిలో స్కానింగ్‌ చేసి.. వాస్తవాలను ప్రజల ముందు పెట్టాం
  • జగదీష్‌రెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నాం
  • విద్యుత్‌పై జ్యూడీషియల్‌ విచారణకు సిద్ధంగా ఉన్నాం
  • కరెంట్‌ అనే సెంటిమెంట్‌ను గత ప్రభుత్వం ఆర్థిక అవసరాలకు వాడుకుంది
  • ఛత్తీస్‌గఢ్‌ నుంచి విద్యుత్‌ కొనుగోళ్లపై ప్రశ్నించిన మమ్మల్ని నాడు మార్షల్స్‌ చేత బయటకు గెంటించారు
  • ఉద్యమంలో పని చేసిన తెలంగాణ విద్యుత్‌ నిపుణులను మారుమూల ప్రాంతాలకు బదిలీ చేశారు
  • రెండేళ్లలో భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు. కానీ, ఏడేళ్లు పట్టింది
  • భద్రాద్రి ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగింది
  • ప్రాజెక్టు కోసం గ్లోబల్‌ టెండర్లు పిలవలేదు
  • బ్యాక్‌ డోర్‌ నుంచి టెండర్లు అంటగట్టారు
  • మూడు అంశాలపై విచారణకు ఆదేశిస్తాం
  • ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న ఒప్పందాలపై విచారణకు ఆదేశిస్తున్నాం
  • రెండో అంశంగా భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ పై విచారణ చేర్చాం
  • మూడో అంశంగా యాద్రాద్రి పవర్‌ప్లాంట్‌ పైనా విచారణ జరిపిస్తాం
  • మొత్తం వాస్తవాలకు బయటకు తీయాల్సిన అవసరం ఉంది
  • బీఆర్‌ఎస్‌ సవాల్‌ మేరకు జ్యుడీషియల్‌ విచారణకు ఆదేశం
  • అప్పుడు మంత్రులుగా ఉన్నవాళ్లను కూడా చేరుస్తాం
  • మీ ఉద్దేశాలు ఏంటో విచారణలో తేలుతాయి
  • ప్రభుత్వం రంగంలో విద్యుత్‌ విషయంలో బీఆర్‌ఎస్‌ సాధించింది గుండు సున్నా
  • ఇప్పటివరకు ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదు
  • ఒక్క మెగావాట్‌ విద్యుత్‌ కూడా ఉత్పత్తి చేయలేదు
  • 24 గంటల ఉచిత విద్యుత్‌ అంటూ అబద్ధాలు చెప్తున్నారు
  • సభలో దబాయిస్తూ ఇంకా ఎంత కాలం గడుపుతారు?
  • కోమటిరెడ్డి లాక్‌బుక్‌ చూపిస్తే.. బుక్‌లు మాయం చేశారు
  • ఇంకా ఎన్నాళ్లూ మోసం చేస్తారు?

     

  • విద్యుత్‌ రంగంపై అవాస్తవ శ్వేతపత్రం విడుదల చేశారు: జగదీష్‌రెడ్డి
  • బీఆర్‌ఎస్‌ పాలనలో విద్యుత్‌రంగంలో ఆస్తులు పెరిగాయి: జగదీష్‌రెడ్డి
  • కోమటిరెడ్డి ఆరోపణలపై విచారణ జరిపించాలి :జగదీష్‌రెడ్డి
  • సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపిస్తే వాస్తవాలు తెలుస్తాయి :జగదీష్‌రెడ్డి

జగదీష్‌కు భట్టి కౌంటర్‌

  • విద్యుత్‌ రంగంపై ‍స్వల్ఫకాలిక చర్చలో విమర్శల పర్వం
  • తెలంగాణ విద్యుత్‌ రంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది
  • డిస్కంలకు బకాయిలకు భారంగా ఉన్నాయి
  • మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సభను తప్పుదోవ పట్టిస్తున్నారు
  • గత ప్రభుత్వం 24 గంటల కరెంట్‌ ఇవ్వలేదు
  • గొంతు తెరిస్తే అబద్ధాలు నిజాలు అయిపోవు

ఆరోపణలపై మాజీ మంత్రి స్పందన.. 

  • నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు
  • ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధం
  • సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించి వాస్తవాలు బయటపెట్టాలి
  • విచారణ జరిపించాలని సీఎంను కోరుతున్నా

జగదీష్‌రెడ్డికి కోమటిరెడ్డి కౌంటర్‌

  • బీఆర్‌ఎస్‌ 24 గంటలు కరెంట్‌ ఇచ్చిందన్నది 
  • 9 గంల కరెంట్‌ కూడా ఇవ్వలేదు
  • విద్యుత్‌ రంగంలో భారీ కుంభకోణం జరిగింది
  • టెండర్‌ లేకుండా పవర్‌ప్లాంట్‌ పెట్టారు
  • యాదాద్రి పవర్‌ప్లాంట్‌లో రూ.20 వేల కోట్ల స్కామ్‌ జరిగింది
  • ఇందులో జగదీష్‌రెడ్డి రూ.10వేల కోట్లు తిన్నాడు
  • మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యేకు కూడా వాటా ఉంది
  • ఫ్రీ కరెంట్‌ పేటెంట్‌ కాంగ్రెస్‌దే
  • దొంగలు, అవినీతి పరులు అనే వరకు భుజాలు తడుముకుంటున్నారు
  • బీఆర్‌ఎస్‌ నేతలకు టీఎస్‌ ట్రాన్స్‌కో, జెన్‌కో అప్పటి సీఎండీ ప్రభాకర్‌రావు దోచిపెట్టారు
  • ఎవరు ఎంత తిన్నారో కక్కిస్తాం.. అలా వదిలేస్తామా?

విద్యుత్‌ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్‌

  • ఆరోజుల్లో పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేశారు
  • నాడు ఊళ్లలోకి వెళ్తే విద్యుత్‌ అధికారుల్ని నిర్బంధించే  పరిస్థితులు ఉండేవి
  • మన రాష్ట్రంలోనే అప్పులు చేసినట్లు మాట్లాడుతున్నారు
  • పరిశ్రమలకు విద్యుత్ హాలిడే - జనరేటర్ లేని దుకాణాలు ఆనాడు లేవు
  • విద్యుత్ బిల్లు వసూలుకు వెళ్లిన అధికారులను పంచాయితీ ఆఫీసు లో బంధించే వాళ్ళు
  • ఆనాడు విద్యుత్ కష్టాలకు ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళే బాధ్యులు
  • అన్ని రంగాలకు 24 గంటలు కరెంట్‌ ఇచ్చాం
  • మేము 50వేల కోట్ల అప్పులు తీర్చాం
  • అప్పు కోసం ఆలోచిస్తే.. ఇప్పుడు 24 గంటల విద్యుత్ ఉండేది కాదు
  • తెలంగాణలో విద్యుత్ లేకుండా వ్యవసాయం చెయ్యలేం
  •  లిఫ్ట్ ఇరిగేషన్ మాత్రమే మనకు బతుకు
  • తెలంగాణ వచ్చేనాటి పరిస్థితి ఏంటో చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు
  • 2014లో ఏపీ ముఖ్యమంత్రి తెలంగాణకు సహకారం ఇవ్వలేదు
  • సాగర్, శ్రీశైలంలో తెలంగాణకు రావాల్సిన వాట ఇవ్వడానికి అడ్డుకున్నారు
  • ఆనాడు కేంద్రం పలుకుబడి ఉపయోగించి ఆనాటి సీఎం ఇబ్బంది పెట్టారు
  • తెలంగాణకు ఎవరైనా విద్యుత్ అమ్మడానికి వచ్చే ప్రైవేట్ వ్యక్తులను సైతం బెదిరించారు
  • విద్యుత్ రంగంలో చేయాల్సిన అభివృద్ధి ఎక్కడా ఆగకుండా జరిగింది

బీఆర్‌ఎస్‌ ఇళ్ల నేతలకు కరెంట్‌ ఇచ్చిందే కాంగ్రెస్‌: మంత్రి శ్రీధర్‌బాబు

  • 2014కి ముందు కరెంటే లేనట్లు బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతున్నారు: మంత్రి శ్రీధర్‌బాబు
  • కరెంట్‌ను బీఆర్‌ఎస్‌ కనిపెట్టినట్లు మాట్లాడుతున్నారు: మంత్రి శ్రీధర్‌బాబు
  • నిన్న నీళ్ల గురించి కూడా అంతే గొప్పగా చెప్పుకున్నారు: మంత్రి శ్రీధర్‌బాబు
  • బీఆర్‌ఎస్‌ ఇళ్ల నేతలకు కరెంట్‌ ఇచ్చిందే కాంగ్రెస్‌

భట్టి ప్రసంగంపై మాజీ మంత్రి స్పందన

  • తెలంగాణ విద్యుత్‌ రంగం పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం
  • వైట్‌ పేపర్‌పై స్పందించిన మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి
  • దేశంలో 24 గంటల కరెంట్‌ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ: జగదీష్‌రెడ్డి
  • తెచ్చిన అప్పులతో ఆస్తులు క్రియేట్‌ చేశాం

👉: విద్యుత్‌రంగంపై శ్వేతపత్రం.. పూర్తి కాపీ

ప్రభుత్వానికి భారంగా విద్యుత్ బకాయిలు: డిప్యూటీ సీఎం భట్టి

  • ఏ రంగానికైనా నాణ్యమైన విద్యుత్ సరఫరా అవసరం - డిప్యూటీ సీఎం
  •  రాష్ట్రం ఏర్పాటు నాటికి 24వందల మెగావాట్ల ఉత్పత్తి ఉండే.
  • రాష్ట్రం ఏర్పడే నాటికే ఆనాటి పాలకుల ముందు చూపుతో మరో 2500 ఉత్పత్తికి ఏర్పాట్లు చేశారు
  • ప్రస్తుతం విద్యుత్ శాఖ ఆందోళన కరంగా ఉంది
  • రూ.81.516 కోట్లు ప్రస్తుతం అప్పులు ఉన్నాయి
  • రూ.36వేల కోట్లు బకాయిలు ఉన్నాయి.. మరో 28వేల కోట్లు చెల్లించాల్సి ఉంది
  • డిస్కమ్ లకు చెల్లించాల్సిన 14వేల కోట్ల రూపాయలు చెల్లించకపోవడం వల్ల మరింత భారం పడింది
  • విద్యుత్ సంస్థలకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి
  • విద్యుత్ సంస్థల ప్రస్తుత స్థితిని ప్రజలకు చెప్పాల్సిన భాధ్యత మా పై ఉంది
  • ఆర్థిక ఇబ్బందులు శ్వేత పత్రం ద్వారా ప్రజలకు వివరిస్తున్నాము
  • విద్యుత్ బకాయిలు ప్రభుత్వానికి భారంగా ఉన్నాయి
  • బీఆర్‌ఎస్‌ వచ్చిన తరువాతే రాష్ట్రంలో బల్బ్ వెలిగింది అన్నట్లు గత పాలకులు మాట్లాడారు
  • బీఆర్‌ఎస్‌ వచ్చిన తరువాతే ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు ప్రకటనలు చేశారు
  • మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడే దేశ వ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది
  • బీఆర్‌ఎస్‌ పాలనలో కొనసాగించాల్సిన ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లలేదు
  • 2014 వరకు జెన్కోలకు 10వేల లోపు అప్పులు ఉంటే.. BRS పదేళ్లలో 81వేలకు తీసుకెళ్లారు
  • సరైన దూరదృష్టి లేకపోవడం వల్ల డిస్కంలు ఇబ్బందుల్లో పడ్డాయి
  • రోజూవారీ మనుగడ కోసం డిస్కంలు అవికాని అప్పులు చేయాల్సి వస్తోంది

తెలంగాణ కరెంట్‌ లెక్కలు

  • తెలంగాణ శాసనసభలో విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టిన కాంగ్రెస్‌ సర్కార్‌
  • రాష్ట్ర విద్యుత్‌ రంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది: డిప్యూటీ సీఎం భట్టి
  • విద్యుత్‌ రంగంపై పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలి: డిప్యూటీ సీఎం భట్టి
  • గత ప్రభుత్వం 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టును మాత్రమే పూర్తి చేసింది: డిప్యూటీ సీఎం భట్టి
  • ఇప్పటివరకు విద్యుత్‌ రంగంలో రూ. 81వేల కోట్ల అప్పు ఉంది: డిప్యూటీ సీఎం భట్టి
  • డిస్కంలకు ప్రభుత్వ శాఖల బకాయిలు రూ.28,842 కోట్లు
  • డిస్కంలకు చెల్లిస్తామన్న బకాయిల్ని గత ప్రభుత్వం చెల్లించలేదు
  • సాగునీటి శాఖ చెల్లించాల్సిన బకాయిలే రూ. 14 వేల కోట్లు
  • బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాకే ఉచిత విద్యుత్‌ ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంది
  • గత కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యుత్‌ రంగంలో ఎన్నో సంస్కరణలు చేపట్టింది
  • గత ప్రభుత్వం చేసిన అప్పులు మరింత ఆందోళన పరిస్థితికి దిగజార్చాయి


విద్యుత్‌ రంగంపై శాసన సభలో స్వల్పకాలిక చర్చ

  • ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • విద్యుత్‌ రంగంపై పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలి: భట్టి
  • తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రం


ప్రారంభమైన తెలంగాణ శాసనసభ
విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రం ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి


కాసేపట్లో ప్రారంభం కానున్న శాసనసభ

  • తెలంగాణ విద్యుత్‌ రంగంపై శ్వేతపత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం
  • సీడబ్ల్యూసీ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్‌
  • సీఎం లేకుండానే కొనసాగనున్న సభ?


రేపు కూడా సభ నిర్వహణ?

  • శాసనసభ సమావేశాల పొడిగింపు?
  • రేపు.. డిసెంబర్‌ 22వ తేదీన కూడా సభ నిర్వహించే యోచనలో ప్రభుత్వం
  • నీటి పారుదల రంగంపై శ్వేతపత్రం విడుదల చేసే యోచనలో రేవంత్‌రెడ్డి సర్కార్‌
  • సీఎం రేవంత్‌ ఇంట్లో మంత్రి ఉత్తమ్‌ భేటీ.. హాజరైన సీఎస్‌

తప్పుల తడకగా ఆర్థిక శ్వేతపత్రం: మాజీ మంత్రి హరీష్‌రావు

  • ఇందులో అప్పులు రూ.6,71,757 కోట్లు అని చూపించారు... అది రూ.5 లక్షల కోట్లే
  • గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ధోరణి ఇది 
  • తెలంగాణను దివాలా రాష్ట్రంగా దుష్ప్రచారం చేస్తే ప్రమాదకరంగా పర్యవసానాలు 
  • విశ్వసనీయత దెబ్బతింటుంది, పెట్టుబడులు రావు 
  • కాళేశ్వరంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు సిద్ధమంటూ సవాల్‌ 
  • రాష్ట్రం ఆర్థికంగా బలపడటానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పునాదులు వేసిందని స్పష్టీకరణ  
     

వాడీ వేఢీగా తెలంగాణ శాసన సభ సమావేశాలు 

  • రాష్ట్ర ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన కాంగ్రెస్‌ సర్కార్‌
  • తీవ్రంగా ఖండించిన ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌
  • ఇరు పార్టీల నేతల విమర్శలు-ప్రతివిమర్శలతో దద్దరిల్లిన సభ
  • అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంలో సర్కారు వెల్లడి 
  • గత పదేళ్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై.. 13 అంశాలతో 42 పేజీల నివేదిక సభ ముందుకు.. 
  • రిజర్వు బ్యాంకు, కాగ్‌ నివేదికలు, కేంద్ర ప్రభుత్వ లెక్కలతో రూపకల్పన 
  • 1956 నుంచి 2023 వరకు అంశాల వారీగా 22 టేబుళ్లతో వివరణ 
  • ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని వివరించడమే ప్రధాన ఉద్దేశమన్న సర్కారు

నేడు  ఆరవరోజు కొనసాగనున్న సభ

  • హాట్‌హాట్‌గా తెలంగాణ అసెంబ్లీ శాసనసభ సమావేశాలు
  • ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదలతో వేడెక్కిన సభ
  • అధికార-ప్రతిపక్షాల నడుమ తీవ్ర వాగ్వాదం
  • నేడు ఆరో రోజు కొనసాగనున్న సభ
  • శ్వేత పత్రం విడుదల చేయనున్న ప్రభుత్వం
  • ఆపై లఘు చర్చ
     

>
మరిన్ని వార్తలు