దుబ్బాక ఎన్నిక చారిత్రాత్మకమైనది: ఉత్తమ్‌

11 Sep, 2020 14:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: దుబ్బాక ఉప ఎన్నికపై ఇందిరా భవన్‌లో శుక్రవారం కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. దుబ్బాక ఉప ఎన్నికను చారిత్రాత్మకమైనదిగా భావిస్తున్నామని  టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ కాంగ్రెస్ శ్రేణులు ఏకతాటిపై నిలవాలి. ఈ ఎన్నికను సీరియస్‌గా తీసుకున్నాం. రాష్ట్ర నాయకత్వం మీ వెంటే ఉంటుంది. రెండు, మూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తాం. ఇప్పటికే మేము కొంత గ్రౌండ్ వర్క్ చేశాం.

ముఖ్యమైన కార్యకర్తలు, ఎవరు నిలబడాలనేది సూచించాలి. మల్లన్నసాగర్ నిర్వాసితులకు గజ్వేల్, సిద్ధిపేట మాదిరిగా పరిహారం చెల్లించాలి.  డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ప్రభుత్వ ఆస్పత్రి భవనం , చేనేత , బీడీ కార్మికులను  కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అన్ని విధాలుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం చేసింది. మండల కమిటీలను మూడు రోజుల్లో పూర్తి చేయాలని డీసీసీ అధ్యక్షులను ఆదేశిస్తున్నా. ఆ తర్వాత విలేజ్ కమిటీ లను ఏర్పాటు చేయాలి’ అని తెలిపారు. 

చదవండి: టీఆర్‌ఎస్‌ కుట్రలను ఛేదిస్తాం

>
మరిన్ని వార్తలు