ఇంటర్‌ విద్యార్థులకు కౌన్సెలింగ్‌ 

19 Apr, 2022 02:47 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురి కాకుండా ప్రత్యేక కౌన్సెలింగ్‌ చేపడుతున్నట్లు ఇంటర్‌ బోర్డు సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. పరీక్షల పట్ల భయం, ఒత్తిడి సహా ఇతర మానసిక సమస్యలు ఎదుర్కొనే వారు బోర్డు సూచించిన ఫోన్‌ నెంబర్ల ద్వారా మానసిక వైద్యులు క్లినికల్‌ సైకాలజిస్టులను సంప్రదించవచ్చని సూచించింది. వారి వ్యక్తిగత నెంబర్లను బోర్డు విడుదల చేసింది.   

మరిన్ని వార్తలు