డ్రగ్స్ నిర్మూలనలో అందరం కలిసి పోరాడదాం : తెలంగాణ డీజీపీ రవిగుప్తా

20 Dec, 2023 11:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డ్రగ్స్‌ సరఫరాదారులు, వాడేవాళ్లకు తెలంగాణ డీజీపీ రవి గుప్తా హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాన్ని డ్రగ్స్‌ ఫ్రీ రాష్ట్రంగా చేసేందుకు కృషి చేస్తోందని.. ఇలాంటి టైంలో డ్రగ్స్ వినియోగించినా, సరఫరా చేసినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనూహ్య పరిణామాల నడుమ.. ఈసీ ఆదేశాలతో డీజీపీగా రవి గుప్తా తాత్కాలిక బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఆయన పూర్తిస్థాయిలో కొనసాగించేందుకే తెలంగాణ ప్రభుత్వం మొగ్గు చూపించింది. తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాదకద్రవ్యాల విషయమై హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. డ్రగ్స్ నిర్మూలనలో అందరం కలిసి పోరాడుదామని.. పోలీసులతో కలిసి ప్రజలంతా ముందుకు రావాలని కోరారాయన.

>
మరిన్ని వార్తలు