ఆర్థిక స్థితిపై అసెంబ్లీలో వైట్‌ పేపర్‌ విడుదల

20 Dec, 2023 12:06 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రం  విడుదల చేశారు. 42 పేజీలతో ఉన్న బుక్‌ను సభలో ప్రవేశపెట్టారు. అనంతరం స్వల్పకాలిక చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులను ప్రజల ముందుంచాల్సిన బాధ్యత తమ మీద ఉందన్నారు. ప్రజలకు సహేతుకమైన పాలన అందించడం తమ బాధ్యత అని భట్టి చెప్పారు.


శ్వేతపత్రం బుక్‌ విడుదలపై బీఆర్‌ఎస్‌ తరపున మాజీ మంత్రి హరీశ్‌రావు అభ్యంతరం చెప్పారు. అరగంట ముందు బుక్‌ రిలీజ్‌ చేసి చర్చించమంటే ఎలా అని ప్రశ్నించారు. బుక్‌లో ఉన్న అంశాలపై అవగాహన కోసం కొంత సమయం కావాలని అడిగారు.

ఇదే రీతిలో ఎంఐఎం ఫ్లోర్‌ లీడర్‌ అక్బరుద్దీనణ్‌ ఒవైసీ, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్‌ చేశారు. దీంతో స్పీకర్‌ అరగంట పాటు అసెంబ్లీని వాయిదా వేసి టీ బ్రేక్‌ ఇచ్చారు.  

👉: కాంగ్రెస్‌ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం.. క్లిక్‌ చేయండి

అరగంట ముందు 40 పేజీల శ్వేతపత్రం విడుదల చేసి చర్చ ప్రారంభించడాన్ని లెజిస్లేటివ్‌ అఫైర్స్‌ మంత్రి శ్రీధర్‌బాబు సమర్థించుకున్నారు. గతంలో కూడా ఇలాంటి సంప్రదాయం ఉందన్నారు. తాము కొత్తగా చేసిందేమీ లేదన్నారు. శ్వేతపత్రంపై సభ్యులు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.  

ఇవీ చూడండి..తెలంగాణ శాసన సభ సమావేశాలు.. లైవ్‌ అప్‌డేట్స్‌

 

>
మరిన్ని వార్తలు