ఫ్రీ బస్‌ ఎఫెక్ట్‌: జుట్లు పట్టుకొని కొట్టుకున్న మహిళలు.. వీడియో వైరల్‌

25 Dec, 2023 17:26 IST|Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి ఫ్రీ బస్ పథకానికి భారీ స్పందన వస్తోంది. బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏ బస్సులో చూసిన 70శాతం వరకు మహిళలే కనిపిస్తున్నారు. పలు రూట్లలో బస్‌ సర్వీసులు సరిపోకపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

అయితే ఉచి­తంగా ప్రయాణించే వె­సు­లుబాటును కొందరు మహిళలు దుర్వి­నియోగం చేస్తున్నారన్న వెల్లువె­త్తు­తున్నాయి. మహిళల సీట్లు నిండిపోవడంతో పురుషుల సీట్లలోనూ కూర్చుంటున్నారన్న వాదన­లు వినిపిస్తున్నాయి. అంతేగా సీట్ల కోసం పలుచోట్ల పంచాయితీలు కూడా జరుగుతున్నాయి. తాజాగా భద్రాచలంలో ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు గొడవకు దిగారు. క్రిస్‌మస్‌ పండగ కావడంతో మహిళలు అధిక సంఖ్యలో ప్రయాణాలు కొనసాగించారు.

ఈ క్రమంలో సీటులో కూర్చునే విషయంలో ఇద్దరు  మహిళల మధ్య ఘర్షణ మొదలైంది. ఇది పెరిగి పెద్దది కావడంతో  ఒకరి జుట్టు మరొకరు పట్టుకొని కొట్టుకున్నారు. చివరికి మిగిలిన మహిళలు సర్ధిచెప్పడంతో వివాదం అక్కడితో సద్దుమణిగింది. ఇదిలా ఉండగా కర్ణాటకలో ఫ్రీ బస్ ఎఫెక్ట్‌ బాగానే ఉంది. ఏదో విషయంలో గొడవ పడిన కొదరు మహిళలు బస్సు దిగి దారుణంగా కొట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

>
మరిన్ని వార్తలు