Hai Nanna Ott Release: అప్పుడే హాయ్ నాన్న ఓటీటీకి.. కారణమిదే!

25 Dec, 2023 16:03 IST|Sakshi

నేచురల్ స్టార్ నాని, సీతారామం బ్యూటీ జంటగా నటించిన చిత్రం హాయ్ నాన్న. డిసెంబర్‌ 7న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో శౌర్యువ్ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌కు ల‌వ్ స్టోరీని జతచేసి తెర‌కెక్కించారు. తండ్రీ, కూతురి స్టోరీ కావడంతో ఆడియన్స్‌కు ఎమోషనల్‌గా కనెక్ట్ అయింది. అయితే థియేట‌ర్ల‌లో ఆడియన్స్‌ను మెప్పించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జవనరిలో ఓటీటీకి రానున్నట్లు తెలుస్తోంది. 

ఈ మూవీ రిలీజైన నలభై రోజుల తర్వాతే ఓటీటీకి రానున్నట్లు తెలుస్తోంది. నలభై రోజుల తర్వాతే ఓటీటీలో రిలీజ్‌ నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో సంక్రాంతికి ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం కనిపించడం లేదు. జనవరి 19న లేదా ఆ తర్వాత ఎప్పుడైనా ఓటీటీలోకి రావొచ్చని సమాచారం. కాగా.. ఈ చిత్రంలో శృతిహాస‌న్ కీల‌క పాత్రలో కనిపించింది. ఈ చిత్రానికి హీష‌మ్ అబ్దుల్ వ‌హాబ్ సంగీతమందించారు. 

కథేంటంటే..
ముంబైకి చెందిన విరాజ్‌(నాని) ఓ ఫ్యాషన్‌ ఫోటోగ్రాఫర్‌. తనకు కూతురు మహి(బేబీ కియారా ఖన్నా)అంటే ప్రాణం. పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడతున్న మహికి అన్నీ తానై చూసుకుంటాడు. సింగిల్‌ పేరెంట్‌గా ఉన్నప్పటికీ కూతురుకి ఎలాంటి లోటు లేకుండా జాగ్రత్త పడతాడు. ప్రతి రోజు రాత్రి కూతురికి సరదాగా కథలు చెప్పడం విరాజ్‌కి అలావాటు. ఆ కథల్లోని హీరో పాత్రని నాన్నతో పోల్చుకోవడం మహికి అలవాటు. ఓ సారి అమ్మ కథ చెప్పమని అడుగుతుంది మహి. క్లాస్‌ ఫస్ట్‌ వస్తే చెప్తానని ప్రామిస్‌ చేస్తాడు నాన్న విరాజ్‌. అమ్మ కథ కోసం నెలంతా కష్టపడి చదివి క్లాస్‌ ఫస్ట్‌ వస్తుంది. తర్వాత కథ చెప్పమని నాన్నని అడిగితే.. చిరాకు పడతాడు. దీంతో మహి ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది.

రోడ్డుపై ప్రమాదం నుంచి కాపాడిన యష్ణతో మహికి స్నేహం కుదురుతుంది. ఇద్దరూ ఓ కాఫీ షాప్‌లోకి వెళ్లి విరాజ్‌కి కాల్‌ చేస్తాడు. విరాజ్‌ కూడా అక్కడికి రాగానే అమ్మ కథ చెప్పమని అడుగుతారు. కూతురు మారం చేయడంతో అమ్మ కథను చెబుతాడు. ఈ కథలో అమ్మ వర్షని యష్ణగా ఊహించుకుంటుంది మహి. అసలు వర్ష ఎవరు? విరాజ్‌-వర్షల లవ్‌స్టోరీ ఏంటి? విరాజ్‌ సింగిల్‌ పేరెంట్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? వర్షకి యష్ణకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? డాక్టర్ అరవింద్‌ (అంగద్ బేడీ)తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న యష్ణ..విరాజ్‌తో ప్రేమలో ఎలా పడింది? ఆ ప్రేమ నిలబడిందా? అరుదైన వ్యాధిని మహి జయించిందా? లేదా? తదితర విషయాలు తెలియాలంటే  ‘హాయ్‌ నాన్న’సినిమా చూడాల్సిందే. 

>
మరిన్ని వార్తలు