హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం

15 Jun, 2022 19:49 IST|Sakshi

నైరుతి రుతుపవనాల ప్రవేశంలో తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమైంది. దీంతో నగరంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. నాంపల్లి, బషీర్‌బాగ్‌, కోఠి, అబిడ్స్‌, అంబర్‌పేట్‌, సుల్తాన్‌బజార్‌, బేగంబజార్‌, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్‌మెట్‌, దిల్‌సుఖ్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్ నగర్, మీర్‌పేట్‌, అత్తాపూర్, రాజేంద్రనగర్, నార్సింగి, గండిపేట్, మణికొండ, పుప్పాలగూడ, కాటేదాన్, పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది.

మరిన్ని వార్తలు