తెలంగాణలో ఇవాళ, రేపు సెలవులు

14 Oct, 2020 13:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో వర్ష బీభత్సానికి దాదాపు 12 మంది మరణించగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునగగా.. పలు నదులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు, పలు ప్రాంతాలు, కాలనీలు వాగులను తలపిస్తున్నాయి. వీధుల్లోని కార్లు, ఆటోలు, బైక్‌లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ప్రభుత్వ కార్యాలయాలకు, ప్రైవేటు సంస్థలకు అక్టోబర్‌ 14,15.. రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. సహాయక చర్యల నిమిత్తం ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సైతం రంగంలోకి దించింది. పురాతన ఇళ్లల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. (‘అవసరమైతే తప్ప రోడ్డు మీదకు రావద్దు’)

హైదరాబాద్‌ రామాంతపూర్ చెరువు నిండి రోడ్ల మీదకి నీరు రావడంతో భారీగా ట్రాఫిక్ నిలిచింది. చెరువు నిండి సమీప కాలనీల్లోకి నీరు వెళ్తుంది. భారీ ట్రాఫిక్ తో వాహనదారులు ఇబ్వందులు పడుతున్నారు. మరోవైపు హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండి, అక్కడి నుంచి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో మూసినది లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నుంచి ప్రజలను తరలించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు మంత్రి కేటీఆర్‌ సూచించారు. హైదరాబాద్ నగర మేయర్, డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్ నగర రోడ్లపైన ప్రస్తుతం పేరుకుపోయిన నీటిని పంపించేందుకు ఓపెన్ చేసిన మ్యాన్‌హోల్స్‌ వద్ద సురక్షిత చర్యలు తీసుకునేలా జలమండలి అధికారులను ఆదేశించారు.  చదవండి : చూస్తుండగానే వరద నీటిలో వ్యక్తి గల్లంతు!

హైదరాబాద్‌లో వందేళ్లలో రెండో అత్యధిక వర్షపాతం నమోదు

  • ఘట్‌కేసర్‌-32 సెం.మీ, హయత్‌నగర్‌- 29.8 సెం.మీ వర్షపాతం
  • హస్తినాపురం-28.4 సెం.మీ, సరూర్‌నగర్‌- 27.3 సెం.మీ వర్షపాతం
  • అబ్దుల్లాపూర్‌మెట్‌-26.6 సెం.మీ, కీసర- 26.3 సెం.మీ వర్షపాతం
  • ఇబ్రహీంపట్నం- 25.7 సెం.మీ, ఓయూ-25.6 సెం.మీ వర్షపాతం
  • ఉప్పల్‌- 25.6 సెం.మీ, మేడిపల్లి-24.2 సెం.మీ వర్షపాతం నమోదు
  • కందికల్‌గేట్‌-23.9 సెం.మీ, రామంతాపూర్‌ 23.2 సెం.మీ వర్షపాతం
  • బేగంపేట్‌-23.2 సెం.మీ, మల్కాజ్‌గిరి-22.6 సెం.మీ వర్షపాతం నమోదు
  • అల్వాల్‌ 22.1 సెం.మీ, ఆసిఫ్‌నగర్‌, సైదాబాద్‌లో 20 సెం.మీ వర్షపాతం
  • కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, ఖైరతాబాద్‌లో 20 సెం.మీ వర్షపాతం నమోదు
Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు