TS EAMCET 2023: ఎంసెట్‌కు దరఖాస్తుల వరద.. 1.20 లక్షలు దాటిన అప్లికేషన్లు

21 Mar, 2023 08:21 IST|Sakshi
(ఫైల్‌ ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకూ మొత్తం 1,23,780 దరఖాస్తులు అందినట్టు ఎంసెట్‌ కన్వీనర్‌ డీన్‌ కుమార్‌ తెలిపారు. ఇందులో 79,420 మంది ఇంజనీరింగ్‌ విభాగానికి, 44,230 మంది అగ్రికల్చర్, మెడికల్‌ విభాగానికి జరిగే ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్నట్టు వెల్లడించారు. ఇంజనీరింగ్, మెడికల్‌ రెండు విభాగాలకూ 130 మంది దరఖాస్తు చేసుకున్నట్టు పేర్కొన్నారు.

గత ఏడాది 1,61,552 మంది ఇంజనీరింగ్‌కు,  88,156 మంది మెడికల్, అగ్రికల్చర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 3వ తేదీ నుంచి ఎంసెట్‌కు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఏప్రిల్‌ 10 వరకూ గడువుండటంతో దరఖాస్తులు గత ఏడాది సంఖ్యను మించిపోతాయని అధికారులు భావిస్తున్నారు.  ఇప్పటి వరకూ ఇతర రాష్ట్రాలకు చెందిన 10 వేల మంది దరఖాస్తు చేసినట్టు తెలిపారు. ఎంసెట్‌ పరీక్షలు మే 7 నుంచి 11 వరకూ జరుగుతాయి.
చదవండి: ఇష్టానుసారం పరీక్ష నిర్వహించడం సరికాదు.. టీఎస్‌పీఎస్సీపై హైకోర్టు సీరియస్‌!

మరిన్ని వార్తలు