పాస్‌పోర్టు బ్లాక్.. ఫిలిప్పీన్స్‌‌లో హైదరాబాద్ యువతి తిప్పలు

4 Aug, 2022 11:26 IST|Sakshi

ఫిలిప్పీన్స్‌లో నవ్య అనే తెలుగు యువతి తిప్పలు పడుతోంది. మనిల్లా ఎయిర్‌పోర్ట్‌లో నవ్యను ఇమిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్నారు. పాస్‌పోర్ట్‌ బ్లాక్ అయ్యిందని, తిరిగి ఇండియాకు వెళ్లిపోవాలని అధికారులు సూచించారు. దీంతో మనిల్లా ఎయిర్‌పోర్ట్‌లో రాత్రంతా నవ్యదీప్తి పడిగాపులు కాసింది. అయితే తన పాస్‌పోర్ట్‌ను కావాలనే బ్లాక్‌ చేశారని నవ్య ఆరోపిస్తున్నారు.

ఫిలిప్పీన్స్‌లోని మనిల్లా ప్రాంతంలో నవ్య 2 ఏళ్ళుగా ఒకే ఇంట్లో నివాసం ఉంటుంది. కోవిడ్ టైంలో అధిక డబ్బులు ఇవ్వాలంటూ ఇంటి ఓనర్ ఒత్తిడి తెచ్చినట్లు ఆమె చెబుతోంది. ఇవ్వకపోతే పాస్‌పోర్ట్‌ బ్లాక్ చేయిస్తా అంటూ బెదిరింపులకు దిగారని..డబ్బులు కట్టనందుకు పాస్ పోర్ట్ బ్లాక్ చేశారంటూ ఆరోపిస్తున్నారు. ఫిలిప్పీన్స్‌ పాస్ పోర్ట్ ఆఫీస్‌లోనే ఇంటి ఓనర్‌ పనిచేస్తున్నట్లు నవ్య తెలిపారు.

కాగా మెడిసిన్‌ కోసం నవ్య మూడేళ్లేగా ఫిలిప్పీన్స్‌లో ఉంటోంది. కోవిడ్‌ సమయంలో ఇండియాకు చేరుకున్న ఆమె ప్రస్తుతం పరిస్థితులు చక్కపడటంతో తిరిగి ఫిలిపిన్స్‌కు బయలు దేధారు. రెండు రోజుల క్రితం నవ్య హైదరాబాద్‌ నుంచి ఫిలిప్పీన్స్‌ వెళ్లారు. అయితే మనిల్లా ఎయిర్ పోర్టులో నవ్యను ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ప్రస్తుతం సింగపూర్‌ ఇమ్మిగ్రేషన్‌ కస్టడీలో ఉన్న ఆమెను.. తిరిగి ఇండియా వెళ్ళేవారకు లగేజ్ ఇవ్వమని తెలిపారు.

మరిన్ని వార్తలు