మాదాపూర్‌లో హైటెక్‌ దందా.. కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ!

26 Sep, 2022 16:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉన్నత చదువులు చదివి.. ఎన్నో ఆశలతో కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న వారికి ఊహంచని షాక్‌ తగిలింది. ఐటీ కొలువు వచ్చిందని.. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేదని భావించిన ఉద్యోగులకు కంపెనీ భారీ షాకిచ్చింది. డబ్బులు వసూలు బోర్డు తిప్పేసింది. 

వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉన్న ధన్యోన్‌ ఐటీ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ బోర్డు తిప్పేసింది. అయితే, అంతకుముందు.. సదరు ఐటీ కంపెనీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కావాలంటూ ఫేస్‌బుక్‌లో ప్రకటన ఇచ్చింది. దీంతో పలువురు నిరుద్యోగులు, ఆశావహులు కంపెనీని సంప్రదించారు. ఈ క్రమంలో కంపెనీ యాజమాన్యం వారికి భారీ ప్యాకేజీలు ఆఫర్‌ చేసింది. 

ఉద్యోగం ఫైనల్‌ చేసుకున్న వారితో కంపెనీ డీల్‌ కుదుర్చుకుంది. సదరు కంపెనీ యాజమాన్యం ఉద్యోగం పేరుతో దాదాపు 200 మంది నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 2 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. డబ్బులు ఇచ్చిన వారికి ఆఫర్‌ లెటర్స్‌ సైతం పంపించినట్టు తెలుస్తోంది. రోజులు గుడుస్తున్నా.. ఆఫీస్‌ నుంచి పిలుపురాకపోవడంతో బాధితులు.. తాము మోసపోయినట్లు గుర్తింపు మాదాపూర్‌ పోలీసులను ఆశ్రయించారు. 
 

మరిన్ని వార్తలు