జూబ్లీహిల్స్‌: కారుతో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ బీభత్సం

6 Apr, 2021 07:51 IST|Sakshi

ముగ్గురికి గాయాలు

సాక్షి, బంజారాహిల్స్‌: ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మద్యం మత్తులో వాహనం నడుపుతూ మూడు స్కూటర్‌లను ఢీకొనడంతో ముగ్గురికి గాయాలైన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. షేక్‌పేట్, ఆదిత్య టవర్స్‌ ఉంటున్న పి.వేణు(25) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తు న్నాడు. ఆదివారం రాత్రి హిమాయత్‌నగర్‌లో తన స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. సోమ వారం ఉదయం కారులో అక్కడి నుంచి బయల్దేరి జూబ్లీహిల్స్‌ మీదుగా షేక్‌పేట ఆదిత్య టవర్స్‌కు వెళుతూ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టులో సిగ్నల్‌ వద్ద ఆగి ఉన్న బైక్‌లను ఢీకొట్టాడు. ఈ ఘటనలో మూడు బైక్‌లు నుజ్జునుజ్జుకాగా ముగ్గురికి గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన తర్వాత అతను కారుతో అక్కడి నుంచి ఉడాయించాడు. అతడిని వెంబడించిన ట్రాఫిక్‌ పోలీసులు ఫిలింనగర్‌లోని ఓ సెల్లార్‌ లో దాక్కున్న వేణును అదుపులోకి తీసుకొని కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సునీల్‌ అనే వ్యక్తి అపోలో ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. క్రాంతికుమార్, శ్రీనివాస్‌ అనే వ్యక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. నిందితుడికి బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్ష నిర్వహించగా 170 బీఏసీ నమోదైంది. బాధితుడు క్రాంతికుమార్‌ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి:కూకట్‌పల్లి: మద్యం మత్తులో యువకుల హల్‌చల్‌..
 5 వేల హెచ్‌ఎం పోస్టులు భర్తీ చేయనున్నారా!
డేంజర్‌ కీటకాలు.. వాహనాలపై ముప్పేట దాడి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు