వేల్పూర్‌కు సీఎం కేసీఆర్‌.. మంత్రి ప్రశాంత్‌రెడ్డి తల్లి అత్యక్రియలకు హాజరు

13 Oct, 2023 10:15 IST|Sakshi

సాక్షి, వేల్పూర్‌/హైదరాబాద్‌: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి వేముల మంజులమ్మ(77) హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. ఆమె చాలారోజులుగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. పరిస్థితి విషమించి ఆమె మరణించడంతో నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండల కేంద్రంలోని ప్రశాంత్‌రెడ్డి నివాసంలో విషాదం నెలకొంది.

బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌లో మంజులమ్మ అంత్యక్రియలు నేడు (శుక్రవారం) జరగనున్నాయి. మంత్రి తల్లి అంత్యక్రియలకు సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారు. కాగా  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే షకిల్‌ పరామర్శించారు.

వేముల మాతృమూర్తి మృతిపై సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో పాటు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ తదితరులు సంతాపం ప్రకటించారు.
చదవండి: నేటి నుంచి తెలంగాణలో బడులకు దసరా సెలవులు

మరిన్ని వార్తలు