గుండెపోటుతో మంత్రి కేటీఆర్‌ మామ మృతి

29 Dec, 2022 16:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఇంట విషాదం నెలకొంది. సీఎం కేసీఆర్ వియ్యంకుడు, కేటీఆర్ మామ పాకాల హరినాథరావు(72) గుండెపోటుతో మృతి చెందారు. హరినాథరావుకు మంగళవారం సాయంత్రం గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం మరింత విషమించడంతో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 8.30 నిమిషాలకు మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

హరినాథరావు మృతితో మంత్రి కేటీఆర్, ఆయన భార్య శైలిమ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన పార్ధివదేహాన్ని రాయదుర్గంలోని ఓరియన్ విల్లాస్‌లో ఉన్న  నివాసానికి తరలించారు. హరినాథరావు మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. వియ్యంకుడికి నివాళులు అర్పించేందుకు సీఎం కేసీఆర్ ఆయన నివాసానికి చేరుకున్నారు.

చదవండి: చంపేస్తామని బెదిరిస్తున్నారు.. హైదరాబాద్‌ మేయర్‌ విజయలక్ష్మిపై ఆరోపణ 

మరిన్ని వార్తలు