పేకాటలో దొరికిన మంత్రి మల్లారెడ్డి సోదరుడు 

17 Jun, 2021 06:35 IST|Sakshi

మరో 12 మంది అరెస్టు 

సాక్షి, కంటోన్మెంట్‌(హైదరాబాద్‌): రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి సోదరుడు చామకూర నర్సింహారెడ్డి (66) పేకాట ఆడుతూ పోలీసులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నర్సింహారెడ్డి గత కొద్దిరోజులుగా తన స్నేహితులతో కలసి న్యూ బోయిన్‌పల్లిలోని మల్లారెడ్డి గార్డెన్స్‌ ప్రాంతంలో ఓ ఫంక్షన్‌ హాల్‌లో పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం మేరకు ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ బృందం బుధవారం దాడులు నిర్వహించింది.

ఈ దాడుల్లో నర్సింహారెడ్డి (66)తో పాటుగా కౌడి సాయిలు (44), నర్సింహారావు (65), హనుమంతు (58), సుదర్శన్‌రెడ్డి (64), మోహన్‌రెడ్డి (49), భాస్కర్‌రెడ్డి (49), గోవర్ధన్‌రెడ్డి (42), జనార్ధన్‌రెడ్డి (42), శ్రీనివాసరాజు (57), వెంగళ్‌రెడ్డి (43), నర్సిరెడ్డి (64), కృష్ణ (40)లు పేకాడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరిని అరెస్టు చేసి విచారణ నిమిత్తం నిందితులను బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. నిందితుల నుంచి రూ.1,40,740ల నగదును 13 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు