తెలంగాణలో పలుచోట్ల ఎన్‌ఐఏ సోదాలు

19 Jul, 2021 22:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్‌ఐఏ పలుచోట్ల సోదాలు నిర్వహించింది. దుమ్ముగూడెం మావోయిస్టు ఆయుధ, పేలుడు పదార్థాల కేసులో మహబూబ్‌నగర్‌ జిల్లాలో ముత్తు నాగరాజు, వి. సతీష్‌ , మేడ్చల్‌లోని కొమ్మరాజు కనకయ్య, భద్రాద్రి జిల్లాలో గుంజి విక్రమ్‌, త్రినాథరావు, జనగామలో సూర సారయ్య, వరంగల్‌లో వేలుపుస్వామి ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నిందితుల నుంచి 400 ఎలక్ట్రిక్‌ డిటోనేటర్లు, 500 నాన్‌ఎలక్ట్రిక్‌ డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని మావోయిస్టు నేత హిడ్మాకు రవాణా చేస్తుండగా ఎన్‌ఐఏ అధికారులు పట్టుకున్నారు. పేలుడు పదార్థాల తయారీకి సంబంధించి పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు