కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ 

8 Dec, 2023 21:19 IST|Sakshi

Live Updates..

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ 

  • మంత్రులకు శాఖల కేటాయింపులపై చర్చ
  • సమావేశంలో తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్ రావు థాకరే

ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్‌..

కాసేపట్లో ఢిల్లీకి రేవంత్‌

  • సీఎం రేవంత్‌ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. 
  • కొత్త మంత్రుల శాఖల కేటాయింపు, మిగతా బెర్తులపై అధిష్టానంతో రేవంత్‌ చర్చించనున్నారు. 
  • రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సెషన్‌
  • అసెంబ్లీలో మంత్రుల ప్రమాణ స్వీకారం. 

విద్యుత్‌ శాఖపై సీఎం రేవంత్‌ సమీక్ష

  • సమీక్షకు హాజరు కాని సీఎండీ ప్రభాకర్‌ రావు.
  • సమావేశానికి రావాలని ఆదేశించినా హాజరు కాని ప్రభాకర్‌ రావు. 
  • విద్యుత్‌ శాఖలో ఇప్పటి వరకు రూ.85వేల కోట్ల అప్పులు ఉన్నాయన్న అధికారులు 

మహిళలకు ఉచిత ప్రయాణంపై సీఎం రేవంత్‌ సమీక్ష

  • సమీక్షకు హాజరైన రవాణాశాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు
  • మహిళలకు ఉచిత ప్రయాణంపై మార్గదర్శకాలు విడుదల చేయనున్న ప్రభుత్వం. 
  • రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. 
  • విధివిధానాలను రూపొందించాలని అధికారులకు రేవంత్‌ ఆదేశం.
  • ఆర్టీసీ పరిస్థితులు, ఆదాయం, వ్యయంపై సీఎం రేవంత్‌ ఆరా. 
  • మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీపై రోజుకు రూ.4కోట్ల భారం పడే అవకాశం. 
  • ఆర్టీసీ బస్సుల్లో రోజూ 12-13 లక్షల మంది ప్రయాణం. 
     

►కాసేపట్లో విద్యుత్‌ శాఖ, ఆర్టీసీపై సీఎం రేవంత్‌ సమీక్ష
►మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రివ్యూ.
►మహిళలకు ఉచిత ప్రయాణంపై నేడు మార్గదర్శకాలు. 
►నిన్న తొలి కేబినెట్‌లోనే విద్యుత్‌ శాఖపై వాడీవేడి చర్చ
►నేడు సమీక్షకు ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ రెడ్డి హాజరుకావాలన్న సీఎం రేవంత్‌. 

►ప్రజా దర్బార్ ముగించుకుని సెక్రటేరియట్ బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

►విద్యుత్ శాఖపై సెక్రటేరియట్‌లో రివ్యూ చేయనున్న సీఎం రేవంత్‌

►సీఎం రేవంత్‌ను కలిసిన ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర నాయకులు 

►జెన్‌కో ఏఈ నియామక పరీక్ష వాయిదా వేయాలని వినతి. 

►సీఎం రేవంత్‌ను కలిసి సమస్యలు చెప్పుకుంటున్న ప్రజలు. వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించిన సీఎం రేవంత్‌. ప్రజా దర్బార్‌లో సీఎంను కలిసిన కొండపోచమ్మ ముంపు బాధితులు. ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదని సీఎంకు వివరించిన బాధితులు. 

►ఇక, ప్రజా దర్బార్‌కు ప్రత్యేక యంత్రాగం. ప్రజల నుంచి వచ్చిన ప్రతీ ఫిర్యాదును పరిశీలించేందుకు 20 మంది సిబ్బంది. వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్లకు, సంబంధిత శాఖ అధికారులకు సిఫార్స్‌ చేస్తున్న సీఎం రేవంత్‌. వచ్చిన ఫిర్యాదులపై మళ్లీ సమీక్ష చేయాలని నిర్ణయించుకున్న సీఎం రేవంత్‌. ప్రతీ నెల వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష. 

►కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ప్రజా దర్బార్‌ ప్రారంభమైంది. అనంతరం, సీఎం రేవంత్‌ రెడ్డి.. ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. 

►జూబ్లీహిల్స్ నివాసం నుంచి జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌కు బయలు దేరిన సీఎం రేవంత్ రెడ్డి..

►మరికాసేపట్లో ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్‌కు హాజరు కానున్న సీఎం రేవంత్‌

►కాసేపట్లో ప్రజా దర్బార్‌..

►ప్రజా దర్భార్‌లో కోసం భారీగా వచ్చిన ప్రజలు..

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి నిన్న(గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం, సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తొలి కేబినెట్‌ భేటీ జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై చర్చించారు. 

ఇదిలా ఉండగా.. నేడు, జ్యోతిరావు పూలే అంబేద్కర్‌ ప్రజా భవన్(ప్రగతి భవన్)లో నేటి నుంచి ప్రజా దర్బార్‌ను నిర్వహించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రజా దర్బర్‌ నిర్వహించనున్నారు. ఈ ప్రజాదర్బార్‌లో సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొననున్నారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్‌ తొలి అడుగు అని కాంగ్రెస్‌ ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఎన్నికల సమయంలో రోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. 

ఇక, విద్యుత్‌పై తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. సెక్రటేరియట్‌లో విద్యుత్ శాఖపై మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేపట్టనున్నారు. సీఏండీ ప్రభాకర్ రావును రివ్యూకు అటెండ్ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్‌ సంస్థలో 85వేల కోట్ల అప్పులపై ఆరా తీయనున్నారు. నేడు సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మరోవైపు, విద్యుత్ సంక్షోభం సృష్టించే కుట్ర జరిగిందని తొలి క్యాబినెట్ సమావేశంలో వ్యాఖ్యానించిన సీఎం రేవంత్‌. అయితే, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు విద్యుత్ కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. 

>
మరిన్ని వార్తలు