ప్రధాని మోదీకి జిమ్‌ కోచ్‌గా మంచిర్యాల జిల్లా వాసి

1 Jul, 2022 16:36 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వస్తున్న ప్రధాని మోదీకి జిమ్‌ కోచ్‌గా మంచిర్యాల జిల్లా వాసిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో మోదీ పర్యటించే రోజుల్లో ట్రెడ్‌మిల్, జిమ్‌ సైకిల్‌ ఇన్‌స్ట్రక్టర్‌గా ఉండేందుకు జిల్లా కేంద్రానికి చెందిన గడప రాజేశ్‌ను నియమిస్తూ స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజేశ్‌ ప్రస్తుతం జింఖానా గ్రౌండ్స్‌లో అథ్లెటిక్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.  

చదవండి: (కిషన్‌రెడ్డి చేతగాని దద్దమ్మలా మిగిలిపోయారు: బాల్కసుమన్‌)

మరిన్ని వార్తలు